Chandrababu : చంద్రబాబు మ‌రో ఐదారు నెల‌లు జైల్లో ఉండాల్సిందేనా..?

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం లో అరెస్ట్ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. అరెస్ట్‌ జరిగిన గంటల వ్యవధిలో బయట పడిపోతారని భావించిన వారి నమ్మకాలు క్రమంగా సడలిపోతున్నాయి. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు జోలికి వెళ్లడానికి ఏ వ్యవస్థలు సందేహించాయో ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఎన్ని ఆరోపణలు, విచారణలు జరిగినా వాటి నుంచి సురక్షితంగా బయటకొచ్చేసిన చంద్రబాబు 73ఏళ్ల వయసులో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలతో బాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చంద్రబాబు జైల్లోకి వెళ్లారు.

చంద్ర బాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రి హోదాలో పనిచేశారు. కాబట్టి ఆయనకున్న ఇన్‌ఫ్లూయన్స్, లీగల్ నాలెడ్జ్ ద్వారా ఆయనకి త్వరగా బెయిల్ వస్తుందని అందరూ అనుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కింద కోర్టులో ఆయనని అరెస్టు చేసిన తీరు ప్రకారమో, ఆయన వయసు రీత్యానో ఆయనకు బెయిల్ ఇవ్వాలి. కాని ఈడీ కూడా విచారిస్తున్న ఈ కేసులో బెయిల్ రావ‌డం క‌ష్ట‌మే అనిపిస్తుంది. ఒక ఐదారు నెల‌లు ఆయ‌న జైలులోనే ఉంటార‌ని అంటున్నారు. ఇప్పుడు వరకు ఆయనని ఈ రకంగా విచారించకపోయినా తాజాగా కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారని తెలుస్తుంది. కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ అంటే విచారించడం కోసం కస్టడీలో ఉంచడం అని అర్థం. అయితే ఈ కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కు అనుమతిస్తే మళ్లీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బెయిల్ ఇచ్చి ఆయన ఇంటి వద్దకే వెళ్లి విచారించమనడం. రెండవది విచారణకు ఆయననే తిరిగి రమ్మనడం.

Chandrababu may stay in jail for another 5 months
Chandrababu

ఒకవేళ బెయిల్ ఇచ్చేస్తే ఆ తర్వాత వీళ్ళు హైకోర్టుకు వెళ్తారు, లేదంటే సుప్రీంకోర్టు వరకూ కూడా వెళ్లే అవ‌కాశం ఉంది.. అయితే సుప్రీంకోర్టు గాని, హైకోర్టు గాని ఈ విషయంలో ఒకటే చెప్తుందని అనుకుంటున్నారు. అదేంటంటే ఈడి కూడా విచారిస్తున్న ఈ కేసులో క్రింద నిందితులు అందర్నీ అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంలో ప్రధాన నిందితుడిని ఎలా వదిలిపెడతారు అంటూ గతంలో చిదంబరం కేసునో లేదంటే జగన్మోహన్ రెడ్డి కేసునో ఉదాహరణగా చూపిస్తారు . ఫైనాన్షియల్ క్రైమ్ అనేది తీవ్రమైన నేరం. కాబట్టి ఇదే నేరంలో గతంలో అరెస్టు అయిన లాలు ప్రసాద్ యాదవ్ విషయంలో గాని, స్టాలిన్ మంత్రి వర్గంలో ఉన్నటువంటి కనిమోలి విషయంలో గాని ఇచ్చిన జడ్జిమెంట్ నే రిపీట్ చేస్తారని అంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago