Harsha Sai : హ‌ర్ష సాయి తొలి స్పీచ్‌తోనే అద‌రగొట్టేశాడుగా..!

Harsha Sai : హ‌ర్ష సాయి.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఈ పేరు గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. యూట్యూబ్‌లో ఆయన చేసే వీడియోలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. పేదలకు భారీ స్థాయిలు డబ్బులను విరాళంగా ఇస్తూ హర్ష సాయి మంచి పేరు తెచ్చుకున్నారు. టిక్ టాక్‌ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన హర్ష సాయి ఆ తర్వాత క్రమేనా యూట్యూబర్‌గా మారి.. యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా హీరోగా మారిపోయారు. ‘మెగా – లో డాన్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందు వస్తున్నాడు. ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలైన ఈ మూవీ టైటిల్ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. అంచనాలను కూడా పెంచేస్తోంది.

టైటిల్ టీజర్ ప్రారంభోత్సవంలో భాగంగా హర్షసాయి తన స్పీచ్‌తో హ‌ర్ష‌సాయి అద‌ర‌గొట్టాడు. తాను ఈ సినిమా ఫంక్షన్ కి రావడం కోసం హోటల్ నుంచి బయటకు వస్తూ ఉండగా ఒక వ్యక్తి తనని పలకరించారు. నేను మీ అభిమానిని మీరు సినిమా చేస్తున్నారు కదా ఆ సినిమాలో మీరు ఎలా ఉంటారో చూడవచ్చా అని అడగడంతో తనకు నేను ఈ టీజర్ చూపించాను. ఇలా చూసినటువంటి ఆ వ్యక్తి చాలా బాగుంది.అయినా మీరు సినిమాలలో ఎందుకు నటిస్తున్నారు మీకేంటి అవసరమని నన్ను ప్రశ్నించారు. ఆ వ్యక్తికి చెప్పిన సమాధానమే ఇక్కడ కూడా చెప్పాలనుకుంటున్నాను అంటూ ఈయన మాట్లాడారు.

Harsha Sai first speech surprised everybody Harsha Sai first speech surprised everybody
Harsha Sai

అతనికి నేను ఇచ్చిన సమాధానాన్ని మీకు కూడా వేదికపై చెప్పాలని అనుకుంటున్నా’’ అని హర్షసాయి వెల్లడించారు. ‘‘మీరు చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు గుర్తున్నాయా?’’ అని ప్రేక్షకులను అడిగారు. ఇందుకు ప్రేక్షకులు.. గుర్తులేవని సమాధానం ఇచ్చారు. ‘‘మరి దాహంతో ఉన్న కాకి కథ?’’ అని హర్ష అడిగారు. ఇందుకు ప్రేక్షకులు గుర్తుందని తెలిపారు. ‘‘మనకు పాఠాలు సరిగ్గా గుర్తుండవు. కానీ, కథలు, మంచి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందుకే, నేను సినిమాలను ఎంచుకోవాలని అనుకున్నాను. అలాగే, ఒకాయన.. సినిమాలు తీసుకుంటూ పోతే.. డబ్బులు వస్తూనే ఉంటాయని అన్నారు. ఎవరికైనా ఇవ్వాలంటే మనకు డబ్బు కూడా అవసరమే కదా.. అందుకే సినిమాలు చేస్తున్నా’’ అని హర్షసాయి పేర్కొన్నారు. ఇక టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే.. మొదటి సినిమాలోనే ఆయన భుజాలపై చాలా భారాన్ని వేసుకుంటున్నారేమో అనే ఫీలింగ్ కలగకమానదు. విజువల్‌గా ఈ మూవీ చాలా రిచ్‌గా ఉంది. హర్ష సాయి బేస్ వాయిస్‌తో చెబుతున్న డైలాగులు కూడా బాగానే ఉన్నాయి. కథలో కూడా ఏదో కొత్తదనం ఉన్నట్లు డైలాగులు, సీన్స్‌ను బట్టి అర్థమవుతోంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

7 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

7 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

7 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

7 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

7 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

7 months ago