Ram Charan : తెలుగు నటనా శిఖరం అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ విగ్రహావిష్కరణతో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. నవరసాలని అత్యద్భుతంగా పలికించాలగల అరుదైన నటుల్లో ఏఎన్నార్ ఒకరు. అలాంటి ఏఎన్నార్ పంచలోహ విగ్రహావిష్కరణ వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించే సమయంలో నాగార్జున ఎమోషనల్ అయ్యారు. పుష్పాలు అర్పించి తన తండ్రికి నివాళులు అర్పించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు.
నటనకే ఓనమాలు దిద్దిన అక్కినేని నాగేశ్వరరావు 1924 సెప్టెంబర్ 20న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ అనే దంపతులకు ఏఎన్నార్ జన్మించారు. 2014 జనవరి 22న ఏఎన్నార్ తుదిశ్వాస విడిచారు. దాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మవిభూషణ్ లాంటి ప్రఖ్యాత అవార్డులు ఏఎన్నార్ నటన నైపుణ్యానికి, కళా సేవకు దాసోహం అయ్యాయి. ఈ రోజు అక్కినేని జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించడంతో ఫ్యాన్స్ చాలా ఆనందానికి గురయ్యారు. ఈ కార్యక్రమానికి మోహన్‌బాబు, బ్రహ్మానందం, రామ్‌చరణ్, మహేష్‌బాబు, నాని, నమ్రత, రాజమౌళి, రమా రాజమౌళి, శ్రీకాంత్, మంచు విష్ణు, అలాగే డీజీపీ అంజనీకుమార్, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్‌రాజు, సీ కళ్యాణ్, జెమినీ కిరణ్, ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు, అలాగే అక్కినేని ఫ్యామిలీ నాగార్జున, అమల, సుమంత్, సుశాంత్, నాగచైతన్య, అఖిల్, సుప్రియా ఇతరులు పాల్గొన్నారు.
అయితే ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్, మహేష్ బాబు పక్క పక్కనే కూర్చొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు, రామ్ చరణ్ ఇంత క్లోజ్‌గా పలకరించుకోవడం అభిమానులకి ఆనందాన్ని కలిగించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…