Chandra Babu : పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తా.. సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు వార్నింగ్‌..

Chandra Babu : ఏపీలో స్కిల్ స్కాంలో తాజాగా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో 52 రోజుల తర్వాత రాజమండ్రి జైలు నుంచి విడుదలైన చంద్ర‌బాబు ప్ర‌స్తుతం త‌న ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునురీసెంట్‌గా జనసేనాని పవన్ కళ్యాణ్ కలిశారు. జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజకీయ అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ఇందులో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు పవన్ భేటీలో టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో పై ప్రధానంగా చర్చించారు.

త్వరలోనే ఉమ్మడిగా పది అంశాలతో మ్యానిఫెస్టో విడుదల చేసే అంశంపై మాట్లాడుకున్నారు. త్వరలో జనసేన టీడీపీ ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రెండు పార్టీల మధ్య మరింత ఎక్కువగా సమన్వయం ఉండేలా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇవాళ్టి భేటీలో చంద్రబాబు కేసులపైనా పవన్ అడిగి తెలుసుకున్నారు. అయితే చంద్ర‌బాబు త‌మ‌పై పెట్టిన కేసులు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. చేత‌కాక మ‌మ్మ‌ల్ని ఇలా వేధిస్తున్నాడ‌ని అన్నారు. నాపైన లోకేష్‌పైన కేసులు పెడుతున్నాడు. ప‌రిపాల‌న చేత కాక ఆయ‌న చేసే ప‌నుల‌న్నింటిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారంటూ చంద్ర‌బాబు అన్నారు. ర‌జ‌నీకాంత్‌పై ఆయ‌న ఏవేవో మాట్లాడారు. ఆయన గురించి ర‌జనీకాంత్ ఏమైన అన్నారా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Chandra Babu strong warning to cm ys jagan about nara lokesh
Chandra Babu

ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ని A14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో లోకేశ్ కు CRPC సెక్షన్ 41A కింద సీఐడీ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 4న విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులో హెరిటేజ్ తీర్మానాలు, అకౌంట్స్ పుస్తకాలు తీసుకురావాలని లోకేష్‍ను సీఐడి ఆదేశించింది. సీఐడీ ఆదేశించిన నిబంధనలపై లోకేశ్ హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో స్పందించిన ధర్మాసనం వాదనలు జరిగిన అనంతరం అకౌంట్స్ బుక్స్ కోసం లోకేశ్ ను ఒత్తిడి చేయవద్దని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం లోకేశ్ ను సిట్ అధికారులు న్యాయవాది సమక్షంలోనే విచారించారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago