Brahmanandam : పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో యూత్ ని అలరించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తన మూడో సినిమాగా ‘కీడా కోలా’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. క్రైం కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ అయింది. సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు. ఇక చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ రీసెంట్‌గా జరగగా, ఈ కార్యక్రమంలో సందడి చేశారు విజయ్ దేవరకొండ. ఇక బ్రహ్మానందం ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఈ సినిమాలో నటించడానికి ఒకే ఒక కారణం తరుణ్ భాస్కర్. ఎందుకంటే.. తరుణ్ గతంలో తీసిన పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలు చూశాను. అవి నాకు బాగా నచ్చాయి.
ఇలాంటి యువ దర్శకులతో నేను కూడా కలిసి పనిచేయాలి అనుకున్నాను. కానీ నేను వెళ్లి సినిమాలో ఛాన్స్ అడగాలంటే నాకు ఈగో అడ్డు వచ్చింది. వాళ్ళే వచ్చి నాకు ఛాన్స్ ఇచ్చి అడిగితే బాగుండు అనుకునేవాడిని. ఇక తరుణ్ కీడా కోలా సినిమాలో నటించమని అడగడానికి నా వద్దకు వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ మూవీ టీం నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. జంధ్యాల గారితో నేను సినిమా చేసినప్పుడు ఎంత హాయిగా.. ఎంత అందమైనటువంటి కామెడీ నాకు పండిందో.. కీడా కోలా చేస్తున్నప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యాను. నాకు జంధ్యాల గారితో కలిసి పనిచేసిన రోజులు గుర్తొచ్చాయి” అని తెలిపారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కూల్ డ్రింక్ లో బొద్దింక పడిందని కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి డబ్బులు లాగుదాం అనే సింపుల్ లైన్ తో తెరకెక్కిన సినిమా కీడా కోలా. అనుకుంటే పరమ రోటీన్ క్రైమ్ కామెడీగా కూడా దీన్ని తీయొచ్చు. కానీ తరుణ్ భాస్కర్ ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఉన్న కథనే కొత్తగా చెప్పాలని ప్రయత్నం చేశాడు. సినిమాలో ఫస్ట్ సీన్ నుంచే తరుణ్ భాస్కర్ మార్క్ కామెడీ మొదలైపోయింది. లాస్ట్ సీన్ వరకు అది ఆగలేదు.. కొన్ని సీన్స్ అయితే పడి పడి నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. సెకండాఫ్ మాత్రం ఒక్క నిమిషం కూడా ఆగకుండా పరిగెత్తింది.. క్రేజీ కామెడీతో సినిమాను పరుగులు పెట్టించాడు తరుణ్ భాస్కర్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…