Team India : వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్ ముందు టీమిండియాకు భారీ షాక్‌..!

Team India : ప్రపంచ కప్ 2023లో భార‌త జైత్ర‌యాత్ర కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే మంచి విజ‌యాల‌తో దూసుకుపోతున్న త‌రుణంలో భార‌త్ కి బిగ్ షాక్ తగిలింది. చీలమండ గాయం నుంచి త్వరగా కోలుకొని నాకౌట్ మ్యాచ్‌లకైనా అందుబాటులోకి వస్తాడనుకున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా టోర్నీ నుంచి పూర్తిగా నిష్క్ర‌మించాడు. గాయం కారణంగా వరల్డ్ కప్ను నుంచి పూర్తిగా దూరమైనట్టు ఐసీసీ ప్రకటించింది. చీలమండ గాయం నుంచి పాండ్యా ఇంకా కోలుకోలేదని, ప్రపంచ కప్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు దూరమవుతున్నట్టు వెల్లడించింది. హార్దిక్ స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ జట్టుతో చేరనున్నాడు. అయితే గాయపడిన ఆల్‌రౌండర్ స్థానంలో.. మరో ఆల్‌‌రౌండర్‌ను తీసుకుకుండా ఫాస్ట్‌బౌలర్‍‌ను ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు సగటు క్రికెట్ ఫ్యాన్స్‌ మెదళ్లను తొలుస్తున్నాయి.

ఇప్ప‌టికే జ‌ట్టులో మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ లాంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. శార్దూల్ ఠాకూర్ లాంటి ఫాస్ట్ బౌలర్ ఆల్‌రౌండర్ కూడా జట్టుతో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ఇండియా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. దీంతో శార్దూల్ ఠాకూర్ సైతం బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో మరో ఫాస్ట్ బౌలర్ అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హార్ధిక్ పాండ్యా లాంటి ఆల్‌రౌండ‌ర్ స్థానంలో ఆల్‌రౌండర్ అయిన అక్షర్ పటేల్‌ను తీసుకోవచ్చు కదా అని కొంతమంది ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రపంచకప్ కోసం మొదట ఎంపిక చేసిన 15 మందిలో అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. కానీ ఆసియా కప్‌‌లో అక్షర్ పటేల్ గాయపడటంతో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టుతో చేరాడు.

Team India facing problem hardik pandya out of world cup
Team India

మెగాటోర్నీలో స్పిన్న‌ర్స్ క‌న్నా ఫాస్ట్ బౌల‌ర్స్ ఎక్కువ ప‌ర్‌ఫార్మ్ చేస్తున్ఆరు. ఇప్పటి వరకూ ఫాస్ట్ బౌలర్లే ఎక్కువ వికెట్లు పడగొడుతూ వచ్చారు. టీమిండియా విషయానికి వస్తే బుమ్రా 15, షమీ 14 వికెట్లు పడగొట్టారు. ఇదే సమయంలో పిచ్‌లు సైతం ఫాస్ట్ బౌలర్లకే కాస్త అనుకూలంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్షర్ పటేల్ వైపు కాకుండా ప్రసిద్ధ్ కృష్ణ వైపు బీసీసీఐ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టులోకి ఎక్స్‌ట్రా పేసర్‌ను తీసుకుంటే ఉపయోగంగా ఉంటుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావించినట్లు తెలుస్తోంది. బుమ్రా, షమీ, సిరాజ్‌లలో ఎవరికైనా ఇబ్బంది తలెత్తినా.. మరో ఫాస్ట్ బౌలర్ అందుబాటులో ఉంటాడని కూడా టీమ్ మేనేజ్‌మెంట్ ఇలా ప్లాన్ చేసింద‌ని అర్ధ‌మైతుంది . కాగా పూణె వేదికగా బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ హార్ధిక్ పాండ్యా గాయపడ్డాడు. ఎడమ చీలమండకు గాయమైంది, ఓవర్ ముగించకుండానే పాండ్యా బయటకు వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి మైదానంలోకి రాలేదు. అయితే పాండ్యా ఎప్పటికి కోలుకుంటాడనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago