Pawan Kalyan : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై దాదాపు 50 రోజులకు పైగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. ఈ నెల 30న బెయిల్ 4 వారాల పాటు ఇంటర్మ్ బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కంటి ఆపరేషన్ నిమిత్తం ఆయనకు బెయిల్ లభించింది. బెయిల్ తర్వాత ప్రత్యేక విమానంలో హైదారాబాద్ చేరుకున్నారు. అక్కడ నుంచి తన జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని తన ఇంటికి వచ్చారు. అయితే జనసేనాని పవన కళ్యాణ్ తన ఇటలీ టూర్ పూర్తి చేసుకొని నిన్న హైదరాబాద్‌కి వచ్చిన విషయం తెలిసిందే.
నేడు టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పరామర్శించారు. జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు నివాసానికి వెళ్లి జనసేనాని పరామర్శించారు. పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్యంపై పవన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం ఉదయం చంద్రబాబు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లి వైద్యులను కలిసి వచ్చారు. చంద్రబాబు జైలు నుంచి వచ్చాక ఆయన అనారోగ్యం నేపథ్యంలో ఆయన్ను పరామర్శించెందుకే పవన్ వచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తో చాలా రోజుల తరువాత పవన్ భేటీ అవ్వడం తో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలనే కీలక నిర్ణయం తీసుకుంది టీడీపీ. అదే సమయంలో బీజేపీతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు భేటి కావడం రెండు ఉభయ రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ 5న వరుణ్ తేజ్- లావణ్యల రిసెప్షన్ ఉండనుండగా,ఆ కార్యక్రమానికి చంద్రబాబుని పవన్ ఆహ్వానించినట్టు సమాచారం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…