Chandra Babu : నందమూరి తారకరత్న మరణంతో ఆయన కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన తిరిగిరాని లోకాలను వెళ్లడంతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు తారకరత్న కుటుంబ సభ్యులు. తారకరత్న చితికి ఆయన తండ్రి మోహనకృష్ణ నిప్పంటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిన్న కర్మతో పాటు పెద్ద కర్మ కూడా ఆయన చేతుల మీదుగానే నిర్వహించారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న కుప్పంలో హార్ట్ స్ట్రోక్ కు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి.. ఆ తర్వాత బెంగళూరు నారాయణ హృదయాలయకు షిఫ్ట్ చేశారు. అప్పటినుంచి చికిత్స కొనసాగింది. కానీ చివరకు తిరిగిరాని లోకాలకు వెళ్లారు తారకరత్న.
నారాయణ హృదయాలయకు విదేశాల నుంచి ప్రత్యేకమైన వైద్య బృందం వచ్చి బెంగళూరులో తారకరత్నకు చికిత్స చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కోమాలోకి వెళ్లిన తారకరత్నను కాపాడేందుకు డాక్టర్లు చేసిన విశ్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి.ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా పరిచయమైన తారకరత్న తొలి సినిమాతో విజయం అందుకున్నారు. ఎన్టీఆర్‌కు మనవడు, ఛాయగ్రాకుడు నందమూరి మోహనకృష్ణకు తనయుడైన తారకరత్నను చాలా గ్రాండ్‌గా లాంచ్ చేశారు కానీ పెద్దగా అదృష్టం కలిసిరాలేదు. రాజకీయాలలో సత్తా చాటాలని అనుకున్న అతనిని మృత్యువు కబళించింది.
అయితే తారకరత్న మరణించినప్పటి నుండి ఆయన జ్ఞాపకాలలోనే బ్రతకుతుంది అలేఖ్య. తాజాగా చంద్రబాబు నాయుడిని కలిసింది అలేఖ్య ఆయన కూతురు.కూతురు నిష్కతో కలిసి తాజాగా అలేఖ్య కలవగా, త్వరలో ఆమె టీడీపీలో చేరనుందని టాక్. చాలా రోజుల తర్వాత తారకరత్న భార్య, కూతురు కనిపించడంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మీటింగ్‌లో అచ్చెన్నాయుడు కూడా కనిపించాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…