Venkatesh : సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అవుతోంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. యాక్షన్ , సెంటిమెంట్ అంశాలతో ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. . తండ్రీకూతుళ్ల బాండింగ్‌తో ట్రైలర్ మొదలైంది.మా నాన్న సూపర్ హీరో…నాన్న ఉంటే నాకు భయం వేయదు అంటూ ఓ చిన్నారి వెంకటేష్ గురించి చెప్పడం ఆసక్తిని పంచుతోంది. పాప ఓ రేర్ డిసీజ్‌తో బాధపడటం…ఆ ఇంజెక్షన్ కాస్ట్ పదిహేడు కోట్లు అని అనే డైలాగ్ తర్వాత ట్రైలర్ కంప్లీట్‌గా యాక్షన్ మోడ్‌లోకి టర్న్ అయ్యింది.
వెంకటేష్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, ఆయనపై చిత్రీకరించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ట్రైలర్ లో గూస్‌బంప్స్‌ను కలిగిస్తున్నాయి. సైంధవ్ సినిమాకు హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. సైంధవ్ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, రుహాణి శర్మతో పాటు ఆండ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ట్రైలర్ రిలీజ్ అనంతరం వెంకటేష్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈక్రమంలోనే తన కొడుకు అర్జున్ గురించి మాట్లాడారు.‘మీ అబ్బాయి అర్జున్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని మీ అభిమానులు కోరుకుంటున్నారు’ అని విలేకరి ప్రశ్నించగా, వెంకటేష్ బదులిస్తూ.. “ప్రస్తుతం తను బాగా చదువుకుంటున్నాడు. ఎవరైనా సరే ముందు బాగా చదువుకోలి. ఆ తరువాత ఏం జరుగుతుంది అనేది తరువాత చూసుకోవాలి” అని బదులిచ్చారు.
ఇక యానిమల్ సినిమా చూసారా, చూస్తే సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయాలని ఉందా అని యాంకర్ ప్రశ్నించారు. దానికి వెంకీ స్పందిస్తూ.. సందీప్‌తోనా అంటూ ఆయనకి ఫోన్ చేయండని సరదాగా అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సైంధవ్ సినిమా తెలుగు, హిందీతో పాటు పాన్ ఇండియన్ లెవల్‌లో రిలీజ్ అవుతోంది. సైంధవ్ సినిమాను తొలుత క్రిస్మక్‌కు రిలీజ్ చేయాలని భావించారు. కానీ ప్రభాస్ సలార్ క్రిస్మర్‌కు బాక్సాఫీస్ బరిలో నిలవడంతో సైంధవ్ సంక్రాంతికి వచ్చేస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…