Chaitanya Master : ఢీ ఫేం చైతన్య ఏప్రిల్ 30న నెల్లూరులోని హోటల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. చనిపోవడానికి ముందు చైతన్య ఒక సెల్ఫీ వీడియో చేస్తూ…. ఆ వీడియోలో ఆత్మహత్యకు కారణాలు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు చెప్పుకొచ్చార. ఢీ షో తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది కానీ ఆర్థికంగా నిలబెట్టలేకపోయిందన్నారు. జబర్దస్త్ షోకి ఇస్తున్న రెమ్యూనరేషన్స్ కూడా ఢీలో ఇవ్వడం లేదన్నారు. అంతేకాదు అప్పులు చేస్తే తీర్చే సత్తా ఉంది కానీ… ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను అని మాట్లాడారు.
ఈ జీవితం చాలు. పేరెంట్స్ క్షమించాలని ఆ వీడియోలో చైతన్య కోరాడు. తన సన్నిహితులను చివరిసారిగా తలచుకున్నాడు. అయితే చైతన్య మరణవార్త బుల్లితెర వర్గాలను భారీ షాక్ కి గురి చేసింది. చైతన్యతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన్ని గుర్తు చేసుకుంటూ పెద్ద తప్పు చేసాడని చెబుతున్నారు. అయితే చైతన్య మాట్లాడిన ఒక ఫోన్ కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైజాగ్ లో ఒక స్టేజ్ షో కోసం డాన్సర్స్ ని ఏర్పాటు చేయాలంటూ ఒకరు చైతన్యకు కాల్ చేయగా, అతను డాన్సర్ ఐశ్వర్యను షో కోసం మాట్లాడాలని కోరతారు. అయితే ఐశ్వర్యకు వేరే షూట్ ఉందని ఇంకొక డాన్సర్ ని మాట్లాడతాను అంటూ చైతన్య చెప్పుకొస్తాడు.
ఇద్దరి మధ్య కొద్ది సేపు సంభాషణ జరిగింది. ఇది చైతన్య ఆఖరి ఫోన్ కాల్ అని చెబుతున్నారు. కానీ, ఇది జనవరిలో జరిగిన సంభాషణలా అనిపిస్తోంది. ఈ ఫోన్ కాల్ లోనే చైతన్యకు సదరు వ్యక్తి ఒక సాంగ్ ఆఫర్ కూడా ఇచ్చాడు. 10 మంది కుర్రాళ్లతో ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేయాలంటూ కోరుతాడు. అయితే చైతన్య లైఫ్ లో నిలదొక్కుకునేందుకు ఇటు ఢీతో పాటుగా బయట షోస్ కూడా చాలా చేస్తూ ఉండేవారు. ప్రస్తుతం కెరీర్‌లో బిజీగా ఉంటున్న చైతన్య ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఫోన్ కాల్ లో అతని మాటలు విన్న అభిమానులు, తోటి కొరియోగ్రాఫర్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…