Choreographer Chaitanya : తెలుగు డాన్స్ రియాలిటీ షో ఢీలో కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న చైతన్య ఆదివారం రోజు ఆత్మహత్య చేసుకోవడం బుల్లితెర వర్గాలను కుదుపుకు గురి చేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చైతన్య ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, అతడు అప్పులపాలు కావడానికి పేమెంట్స్ ఆపేయడమేనని పల్సర్ బైక్ ఝాన్సీ సంచలన కామెంట్స్ చేసింది. ఆమె తాజాగా మాట్లాడుతూ.. చైతన్య డిసెంబర్ 31 నైట్ ఒక ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్ విషయంలో కొందరు ఆర్టిస్ట్స్ చైతన్యకు హ్యాండ్ ఇచ్చారని ఆమె అన్నారు.
కొందరు ఆర్టిస్ట్‌లు ముందుగా వస్తామని చెప్పి ఆ తర్వాత రాకపోవడంతో ఈవెంట్ ఆర్గనైజర్స్ పేమెంట్ ఆపేశారు. అది దాదాపు రూ. 6 లక్షల రూపాయలు. ఆ డబ్బు కోసం చైతన్య ఎన్నో అప్పులు చేశారు. ఆర్టిస్ట్స్ కి ఇవ్వడానికి ఆయన అప్పులు చేయగా, ఆయన చనిపోవడానికి ఇదే ప్రధాన కారణమని ఝాన్సీ అంటున్నారు. కాగా, చైతన్య మంచి వ్యక్తి. ఎప్పుడూ పక్కవాళ్ళ గురించి ఆలోచిస్తారు. సహాయం చేస్తారు. మేము ఒంగోలులో ఈవెంట్ చేస్తుండగా చైతన్య మరణవార్త తెలిసింది అని ఝాన్సీ పేర్కొంది.
చైతన్యకి ఇబ్బందిగా ఉంటే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే సరిపోయేది. డబ్బులు ఇవ్వలేనంటే ఒప్పుకునేవారు. ప్రాణాలు తీసుకుని పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు ఆయన నిర్ణయం వలన అమ్మ, నాన్న, చెల్లి బాధపడుతున్నారు, అని ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈవెంట్ ఆర్గనైజర్స్ నా విన్నపం ఏమిటంటే… ఒంట్లో బాగున్నా లేకున్నా మేము షో చేస్తాము. మా పెర్ఫార్మన్స్ నచ్చకపోతే మరోసారి పిలవద్దు … అంతే కానీ పేమెంట్స్ ఆపవద్దు. అది చాలా మంది ఆర్టిస్ట్స్ జీవితాలను ప్రభావితం చేస్తుందని ఝాన్సీ అన్నారు. కాగా, చైతన్య నెల్లూరులోని ఓ హోటల్ లో చైతన్య మాస్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. చనిపోవడానికి ముందు చైతన్య ఒక సెల్ఫీ వీడియో చేశారు. ఆ వీడియోలో ఆత్మహత్యకు కారణాలు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు చెప్పారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…