BTech Ravi Son Ramiredddy : బీటెక్ ర‌వి అరెస్ట్ త‌ర్వాత జ‌గ‌న్‌కి స్ట్రాంగ్ వార్నింగ్..!

BTech Ravi Son Ramiredddy : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. పోలీసులంతా మప్టీలో ఉండటంతో వారంతా పోలీసులేనా.. లేకుంటే గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారా..? అని కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందాయి. రవి అరెస్టును పోలీసులు అధికారికంగా నిర్ధారించారు. మొదట వల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు అక్కడ్నుంచి కడప రిమ్స్‌కు తరలించారు. అయితే రవి విషయంలో అసలు ఏం జరిగింది..? అనే విషయాలను కడప జిల్లా డీఎస్పీ షరీప్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి తెలియ‌జేశారు.

పది నెలలు కిందట కడప విమానాశ్రయం దగ్గర ఆందోళన చేసినందుకు బీటెక్ రవిని అరెస్ట్ చేశాం. తోపులాటలో మా ఏఎస్ఐకి గాయాలయ్యాయి. దానిపైన విచారణ చేసి ఇప్పు డు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం. 10 నెలలుగా రవి అందుబాటులో లేరు. అందుకే ఇప్పుడు అన్ని పరిశీలించి అరెస్ట్ చేయాల్సి వచ్చింది’ అని డీఎస్పీ షరీప్ మీడియాకు వివరించారు. అయితే.. 10 నెలల విషయం ఇప్పుడు ఎందుకు బయటికి తీసినట్లు ఎందుకు అనే దానిపై ఇప్పుడు అంత‌టా డిస్క‌ష‌న్ న‌డుస్తుంది.

BTech Ravi Son Ramiredddy strong warning
BTech Ravi Son Ramiredddy

బీటెక్ రవి అరెస్ట్‌పై యువనేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘పుట్టిన ఊరు, గెలిచిన నియోజ‌క‌వ‌ర్గం అయిన పులివెందుల వెళ్లాల్సి వ‌చ్చినా జ‌గ‌న్ రెడ్డి గ‌జ‌గ‌జా వ‌ణుకుతున్నాడు. ప‌ర‌దాలు, బారికేడ్లు, ముంద‌స్తు అరెస్టులు, దుకాణాల మూసివేత‌, చెట్ల న‌రికివేత ఇన్ని చేసినా ఓట్లేసిన జ‌నంని చూడాలంటే జ‌గ‌న్ రెడ్డికి భ‌యం. సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల్ని ఎదుర్కోలేని పిరికి పంద జ‌గ‌న్. రాజకీయ కక్షసాధింపుకి పోలీసుల్ని పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నాడు. రవి అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను.

ఆయనకి ఏం జ‌రిగినా జ‌గ‌న్, పోలీసుల‌దే బాధ్యత‌’ అని లోకేష్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. మ‌రోవైపు ర‌వి త‌న‌యుడు రామిరెడ్డి కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మా నాన్నకు పులివెందులలో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక అక్రమ అరెస్టు చేశారని టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి కుమారుడు రామిరెడ్డి విమర్శించారు. గురువారం పులివెందుల టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. అన్యాయంగా తన తండ్రిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. ఎటువంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. బెట్టింగ్ కేసులో కూడా అన్యాయంగా మానాన్న పేరు చేర్చారని స్ప‌ష్టం చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago