Bro Movie Producer : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో సముద్రఖని తెరకెక్కించిన చిత్రం బ్రో. తమిళ మూవీకి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం జూలై 28న విడుదలై అన్ని చోట్ల కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్.థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతూ బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తూ రీసెంట్‌గా విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ వేడుకలో చిత్ర నిర్మాతలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారి కలయికలో మా 25 వ సినిమా చేయడం సంతోషంగా ఉంది. అనుకున్న సమయానికి సినిమాని పూర్తి చేయడానికి ప్రధాన కారణం సముద్రఖని గారు. ఇంత మంచి సినిమాని, త్రివిక్రమ్ గారు తన సంభాషణలతో ప్రేక్షకుల హృదయాల్లోకి తీసుకెళ్లారు. మామూలుగా నాకు సినిమా చూసేటప్పుడు ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. అలాంటిది ఈ సినిమా చూసేటప్పుడు ఒక్కసారి కూడా ఫోన్ చూడలేదు. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు అని అన్నారు. మరోవైపు ఈ సినిమాని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ నిర్మాత స్టన్నింగ్ కామెంట్స్ చేశారు.
ముందు నుంచి అనుకున్నట్లుగానే ఈ సినిమాలో ఇచ్చిన సందేశం కుటుంబ ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ సినిమాకి పెద్ద రన్ ఉంటుందని ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమాని పూర్తి చేయడానికి అందించిన సహకారం మరవలేనిది. తేజ్ గారు అంత పెద్ద యాక్సిడెంట్ తర్వాత కూడా ఎంతో కష్టపడి సినిమాకి ప్రాణం పోశారు. థమన్ అద్భుతమైన సంగీతం అందించారు. సముద్రఖని గారు 24 గంటలు సినిమా గురించే ఆలోచిస్తారు. ఈ సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు అని సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…