Nara Lokesh : టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. వినుకొండ నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన లోకేష్.. అంతకు ముందు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరిలో పట్టుదల ఉందని, కచ్చితంగా టీడీపీ గెలవబోతోందని చెప్పారు. అనునిత్యం ప్రజలతో ఉండే బలమైన అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. పార్టీకి ఇన్ఛార్జీ లేకపోయినా దర్శి నియోజకవర్గంలో పాదయాత్ర సక్సెస్ అయిందని చెప్పారు. ఎన్నికల తర్వాత ఇన్ఛార్జీ వ్యవస్థ ఉండదని అన్నారు. ముండ్లమూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభలో లోకేశ్ ప్రసంగిస్తూ, భారీ జన సందోహంతో దర్శి దద్దరిల్లిందని పేర్కొన్నారు. జగన్ కొత్త పథకం ప్రారంభించాడు. ఆ పథకం పేరు ఏంటో తెలుసా ‘సైకో స్విమ్మింగ్ పూల్స్’. ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నా అని బిల్డప్ ఇచ్చాడు జగన్. కానీ కట్టింది ఏంటో తెలుసా? స్విమ్మింగ్ పూల్స్. చిన్న వర్షం వస్తేనే ఆ స్థలాలు స్విమ్మింగ్ పూల్స్ లా తయారు అవుతున్నాయి. మొన్న వారం రోజులు వరుసగా వర్షాలు పడ్డాయి. అప్పుడు ప్యాలస్ బ్రోకర్ సజ్జల పరిగెత్తుకుంటూ జగన్ దగ్గరకు వెళ్లాడు. సార్ సెంటు స్థలాలు అన్ని మునిగిపోయాయి… పునాదులు కూడా కనపడటం లేదు… జనం గోల పెడుతున్నారు అన్నాడట. అప్పుడు జగన్ ప్యాలస్ బ్రోకర్ ని రెండు పీకాడు. ఈత కొట్టుకుంటూ వెళ్లు పునాదులు కనిపిస్తాయి అన్నాడు.
25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు జగన్. ప్రజలు 31 మంది ఎంపీలను ఇచ్చారు. కానీ, ప్రత్యేక హోదా సాధించాల్సిన వైసీపీ ఎంపీలు రాష్ట్రం పరువు తీస్తున్నారు. ఒక ఎంపీ జిప్పు విప్పి దేశం మొత్తం చూపించాడు. ఒక ఎంపీ మర్డర్ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒక ఎంపీ యూట్యూబ్ లో వీడియోలు, రీల్స్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఒక ఎంపీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుకున్న కొడుకుని కాపాడే పనిలో ఉన్నాడు. ఒక ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్ అయితే హైదరాబాద్ పారిపోయాడు. ఏ2 ఎంపీ ఏ స్కాంలో ఎంత వచ్చిందో లెక్కలు వేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఏ1 ప్యాలస్ లో పడుకున్నాడు. 31 ఎంపీలను గెలిపిస్తే జగన్ యువత చేతికి చిప్ప ఇచ్చాడు. పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి కొంత మంది పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ థాంక్స్ అంటూ నారా లోకేష్ చురకలు అంటించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…