Boya Naveena : ఇప్పుడిప్పుడే అన్ని ఫలితాలు వస్తున్నాయి. రీసెంట్‌గా ఇంటర్ ఫలితాలు విడుదల కాగా టెన్త్ ఫలితాలు కూడా విడుదల చేసేందుకు ప్రణాళికలు రచించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఇందులో పలువురు విద్యార్థుల జీవితాలు పలువురికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇంటి పరిస్థితి బాగా లేకున్నా అత్యధిక మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కూలి పనులకు వెళ్తూ పదోతరగతి చదివింది. వారంలో మూడు రోజులు కూలికి.. మూడు రోజులు స్కూల్ కి వెళ్తూ చదువుకుని టెన్త్‌లో 509 మార్కులు సాధించి ఆ బాలిక అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.
చదువుకు పేదరికం ఎలాంటి అడ్డంకి కాదని నిరూపించింది ఓ బాలిక. కూలి పనులు చేస్తూ పట్టుదలతో చదివి టెన్త్ లో 600 మార్కులకు 509 మార్కులు సాధించి అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. ఆ విద్యార్థిని మరెవరో కాదు కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ నవీన. బోయ ఆంజనేయులు, వన్నూరమ్మల కుమార్తె కాగా, వీరిది పేద కుటుంబం. కూలి పనులు చేస్తే పూట గడవని పరిస్థితి. తండ్రి వ్యవసాయ కూలీ. తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. కుటుంబ పరిస్థితిని గమనించిన నవీన అండగా ఉండేందుకు కూలి పనులకి సైతం వెళ్లేది. అయితే ఆమె వారంలో మూడు రోజులు కూలి పనులకు వెళ్తూ.. మూడు రోజులే పాఠశాలకు వెళ్లేది.
చిప్పగిరి ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికకు చదువుపై ఉన్న శ్రద్ధను చూసి ఉపాధ్యాయులు ఆమెని ఎంతగానో ప్రోత్సహించారు. ఆమె చదువుకునేందుకు కావాల్సిన సహాయం అందించారు. ఈ క్రమంలో నవీన పదో తరగతిలో కష్టపడి చదివి పదో తరగతిలో ఫలితాల్లో 509 మార్కులు సాధించింది. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కెల్లా అత్యధిక మార్కులు సాధించి అందరి మన్ననలను అందుకుంది. ఇక ఇదిలా ఉంటే విజయవాడలోని గోవింద రాజుల ఈనాం ట్రస్ట్ మున్సిపల్ పాఠశాల పదో తరగతి విద్యార్థిని గాడెల్లి సువర్షిత 594 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. తండ్రి నాగరెడ్డిబాబు ఆటో డ్రైవర్ కాగా, తల్లి బేబి సరోజని గృహిణి. వారికి ముగ్గురు కుమార్తెలు. పటమటకు చెందిన నాగిరెడ్డి తన ముగ్గురు కుమార్తెలను మగ పిల్లలకంటే ధీటుగా పెంచారు. ఆటో నడుపుకుంటూ వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే పదో తరగతి ఫలితాల్లో పెద్ద కుమార్తె సువర్షిత 594 మార్కులు సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…