Harshita : ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 22న పదో తరగతి ఫలితాలు విడుదల కాగా, ఈ ఫలితాల్లో మట్టిలో మాణిక్యాలు అసాధారణ ప్రతిభ కనబరిచారు. టెన్త్ పరీక్ష ఫలితాల్లో రికార్డు స్థాయి మార్కులు తెచ్చుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి పరిస్థితి తెలుసుకున్న ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు..ఉమ్మడి కర్నూలు జిల్లా రుద్రవరం మండలం బీరవోలు ప్రాంతానికి చెందిన హర్షిత పదో తరగతి పరీక్షలలో 594 మార్కులు సాధించి అందరిని ఆశ్చర్యపరచింది. హర్షిత తండ్రి రైతు కాగా ఈమెకు మంచి మార్కులు రావడంతో గ్రామస్తుల ఆనందం అంతా ఇంతా కాదు. ఆమెని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.
హర్షితకు మంచి మార్కులు తెచ్చుకోవడంతో ఉన్నత చదువులకు ప్రభుత్వం నుంచి కూడా కొంతమేర సహాయం అందిస్తే బాగుంటుందని ఊరి జనాలు ముచ్చటించుకుంటున్నారు. హర్షిత తన టాలెంట్ తో ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు.ఈ సారి ఏపీ పరీక్ష ఫలితాలలో ఎంతో మంది ఆణిముత్యాలు వెలుగులోకి వచ్చారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి కూడా మంచి మార్కులు వచ్చాయి. ఒక్క హిందీలో తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టుల్లో 100కు వంద మార్కులు సాధించింది. నూజివీడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో మనస్వీ చదివింది.
తల్లిదండ్రులు ఆకుల నాగ వరప్రసాద్, నాగ శైలజ ఇద్దరూ ఉపాధ్యాయులే కావడంతో టీచర్ల బోధనతోపాటు వారి గైడెన్స్ సైతం ఎంతగానో ఉపయోగపడిందని తెలిపింది. ఐఐటీలో చదవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనస్వీ పేర్కొంది. ఇక మరికొన్ని గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు రిలీజ్ కానుండగా పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో చూడాల్సి ఉంది.తల్లీదండ్రులు ప్రోత్సహిస్తే విద్యార్థులు పరీక్షల ఫలితాలలో అద్భుతాలు చేస్తారని చాలామంది విద్యార్థులు ప్రూవ్ చేస్తున్నారు. తెలంగాణ టెన్త్ ఫలితాలలో కూడా పేదింటి విద్యార్ధులు సత్తా చూపించడం ఖాయం అని అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…