Pat Cummins : తెలుగులో పుష్ప డైలాగ్ చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ప్యాట్ కమిన్స్‌

Pat Cummins : స‌న్ రైజ‌ర్స్ త‌ర‌పున ఆడుతున్న విదేశీ ఆట‌గాళ్లు తెలుగు వాళ్ల‌ని ఇంప్రెస్ చేసేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు ఆస్ట్రేలియన్ క్రికెట్ ఆటగాడు డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాల డైలాగులు చెప్పి దుమ్ములేపేసేవాడు. దానితో అతనికి బాగా అభిమానులు పెరిగారు. అతను ఇక అది అలవాటుగా మార్చుకొని ఏ పెద్ద తెలుగు సినిమా విడుదలైన, ఆ సినిమాలో నటుడిని, లేదా పాటని అనుకరించి రీల్స్ చేస్తూ నెటిజ‌న్స్‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేసేవారు. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర చేసిన వ్యవహారశైలి ‘తగ్గేదే లే’ అనే దానిని అనుకరిస్తూ చేసిన వార్న‌ర్ ఫుల్ గా ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నాడు.

డేవిడ్ వార్నర్ .. అల్లు అర్జున్ లాంటి వాళ్ల‌నే కాదు మ‌హేష్ బాబు లాంటి చాలామంది అగ్రనటులను సైతం అనుకరించాడు . ఇప్పుడు వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడుతున్నాడు, అయినా తెలుగు నటుల రీల్స్ చేస్తూనే వున్నాడు. ఇప్పుడు ఆయ‌న బాట‌లోనే ఆస్ట్రేలియా కెప్టెన్ చేరాడు. తాజాగా ఈ స్టార్ క్రికెటర్ తెలుగు డైలాగ్స్​ చెప్పి నెటిజన్లను అబ్బురపరిచాడు. “ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను”, “కమ్మిన్స్ అంటే క్లాస్ అనుకున్నావా? మాస్ ఊరమాస్”, “SRH అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ” అంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు పాట్ క‌మిన్స్. అంతే కాకుండా పవన్ కల్యాణ్ మేనరిజం చేసి అదరగొట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.

Pat Cummins told pusha movie dialogue in telugu
Pat Cummins

ఇక కమ్మిన్స్ కెప్టెన్సీలో ఎస్ఆర్‌హెచ్ దుమ్ము లేపుతుంది. ప్రస్తుతం ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు సూపర్ ఫామ్​లో ఉంది. సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకెళ్తోంది. గ్రూప్-స్టేజ్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదింటిలో విజయం సాధించిన ఈ జట్టు, ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు రికార్డు(ఆర్సీబీపై 287)ను కూడా ఇటీవలే సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఏకంగా మూడు సార్లు 250కి పైగా పరుగులు చేసింది. మొదటి మూడు మ్యాచ్‌లలో రెండింట్లో ఓడిపోయిన సన్‌రైజర్స్‌ పేలవంగా టోర్నీ మొదలుపెట్టి ఆ త‌ర్వాత సంచ‌ల‌నాలు సృష్టించింది. ఓ ప్లేయర్​గానే కాకుండా ఓ కెప్టెన్​గానూ జట్టుకు ఎంత‌గానో సాయ‌ప‌డుతున్నాడు కమ్మిన్స్.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago