Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home viral

Boya Naveena : కూలీ ప‌నులు చేస్తూ వారంలో మూడు రోజులే స్కూలుకి.. ఆమెకి వ‌చ్చిన మార్కులు ఎన్నంటే..!

Shreyan Ch by Shreyan Ch
April 26, 2024
in viral, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Boya Naveena : ఇప్పుడిప్పుడే అన్ని ఫ‌లితాలు వ‌స్తున్నాయి. రీసెంట్‌గా ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల కాగా టెన్త్ ఫ‌లితాలు కూడా విడుద‌ల చేసేందుకు ప్రణాళిక‌లు ర‌చించారు. అయితే ఆంధ్రప్రదేశ్​లో సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఇందులో పలువురు విద్యార్థుల జీవితాలు పలువురికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇంటి పరిస్థితి బాగా లేకున్నా అత్యధిక మార్కులు సాధించి శభాష్‌ అనిపించుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కూలి పనులకు వెళ్తూ పదోతరగతి చదివింది. వారంలో మూడు రోజులు కూలికి.. మూడు రోజులు స్కూల్ కి వెళ్తూ చదువుకుని టెన్త్‌లో 509 మార్కులు సాధించి ఆ బాలిక అంద‌రికి ఆద‌ర్శంగా నిలుస్తుంది.

చ‌దువుకు పేద‌రికం ఎలాంటి అడ్డంకి కాద‌ని నిరూపించింది ఓ బాలిక‌. కూలి పనులు చేస్తూ పట్టుదలతో చదివి టెన్త్ లో 600 మార్కులకు 509 మార్కులు సాధించి అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. ఆ విద్యార్థిని మరెవరో కాదు కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ నవీన. బోయ ఆంజనేయులు, వన్నూరమ్మల కుమార్తె కాగా, వీరిది పేద కుటుంబం. కూలి పనులు చేస్తే పూట గ‌డ‌వ‌ని ప‌రిస్థితి. తండ్రి వ్యవసాయ కూలీ. తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. కుటుంబ పరిస్థితిని గమనించిన నవీన అండగా ఉండేందుకు కూలి ప‌నుల‌కి సైతం వెళ్లేది. అయితే ఆమె వారంలో మూడు రోజులు కూలి పనులకు వెళ్తూ.. మూడు రోజులే పాఠశాలకు వెళ్లేది.

Boya Naveena inspiring other students with her studies from kurnool
Boya Naveena

చిప్పగిరి ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికకు చదువుపై ఉన్న శ్రద్ధను చూసి ఉపాధ్యాయులు ఆమెని ఎంత‌గానో ప్రోత్సహించారు. ఆమె చదువుకునేందుకు కావాల్సిన సహాయం అందించారు. ఈ క్రమంలో నవీన పదో తరగతిలో కష్టపడి చదివి పదో తరగతిలో ఫలితాల్లో 509 మార్కులు సాధించింది. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కెల్లా అత్యధిక మార్కులు సాధించి అందరి మన్ననలను అందుకుంది. ఇక ఇదిలా ఉంటే విజయవాడలోని గోవింద రాజుల ఈనాం ట్రస్ట్ మున్సిపల్‌ పాఠశాల పదో తరగతి విద్యార్థిని గాడెల్లి సువర్షిత 594 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. తండ్రి నాగరెడ్డిబాబు ఆటో డ్రైవర్‌ కాగా, తల్లి బేబి సరోజని గృహిణి. వారికి ముగ్గురు కుమార్తెలు. పటమటకు చెందిన నాగిరెడ్డి తన ముగ్గురు కుమార్తెలను మగ పిల్లలకంటే ధీటుగా పెంచారు. ఆటో నడుపుకుంటూ వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే పదో తరగతి ఫలితాల్లో పెద్ద కుమార్తె సువర్షిత 594 మార్కులు సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.

Tags: Boya Naveena
Previous Post

Pat Cummins : తెలుగులో పుష్ప డైలాగ్ చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ప్యాట్ కమిన్స్‌

Next Post

Harshita : రైతు బిడ్డ‌నా మ‌జాకానా.. ప‌దో త‌ర‌గ‌తి పరీక్షలలో 594 మార్కులు సాధించిన హ‌ర్షిత‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

by Shreyan Ch
September 22, 2024

...

Read moreDetails
వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.