Body Detox : రోజూ మనం మన ఇంటిని, ఇంటి బయట పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటుంటాం. చెత్తను, వ్యర్థాలను ఊడ్చేస్తుంటాం. కానీ మన శరీరం గురించి మాత్రం పట్టించుకోము. దీంతో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. అవి అనారోగ్యాలను కలగజేస్తుంటాయి. ముఖ్యంగా మనం పాటించే జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్లనే మన శరీరంలో చెత్త ఎక్కువగా పేరుకుపోతుంది. రోజూ బయట లభించే ఆహారాలు, ముఖ్యంగా జంక్ ఫుడ్, మద్యం, సిగరెట్లు, నూనె పదార్థాలు, బేకరీ ఆహారాలను తినడం వల్ల వాటిల్లో ఉండే చెడు పదార్థాలు మనకు అనేక వ్యాధులను కలగజేస్తాయి.
దీంతో మొటిమలు, మచ్చలు రావడం, జుట్టు సమస్యలు, జుట్టు రాలిపోవడం, కంటి సమస్యలు, అధిక బరువు, బద్దకంగా ఉండడం, శక్తి లేకుండా నిస్సత్తువగా ఉండడం, చర్మంపై దద్దుర్లు, గుండె, కిడ్నీలు, కాలేయం సమస్యలు వంటివి వస్తున్నాయి. వీటిల్లో చెడు పదార్థాలు చేరి వ్యర్థాలుగా మారి మనకు అనారోగ్యాలను కలగజేస్తున్నాయి. అయితే ఈ వ్యర్థాలతో నిండిపోయే మన శరీరాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అందుకు గాను కొన్ని పదార్థాలు ఉపయోగపడతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు మార్కెట్‌లో ఎక్కడ చూసినా కలబంద జ్యూస్ లభిస్తుంది. దీన్నే ఇంగ్లిష్‌లో అలొవెరా అంటారు. ఇందులో లాక్సేటివ్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఫలితంగా వ్యర్థాలు పేరుకుపోవు. ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాయి. అలాగే జీర్ణాశయంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగు పడుతుంది. ఈ జ్యూస్‌లో ఉండే ఫైబర్ శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. దీని వల్ల కొవ్వు కరిగిపోయి బరువు తగ్గుతారు. అలాగే ఈ జ్యూస్‌ను తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.
ఇక శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో మనకు గోధుమ గడ్డి జ్యూస్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కూడా మనకు మార్కెట్ లో లభిస్తుంది. అలొవెరా జ్యూస్ లాగే దీన్ని కూడా మనం సేవించవచ్చు. ఉదయం పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో దీన్ని తాగాలి. ఇలా రోజూ చేయాలి. దీని వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. గోధుమ గడ్డి జ్యూస్ ను సేవించడం వల్ల మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా బీటాకెరోటిన్, విటమిన్ సి, 90 రకాల మినరల్స్, 18 రకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. అలాగే పాలకూర కన్నా ఎక్కువ శాతం ఐరన్‌ను పొందవచ్చు. దీంతోపాటు 70 శాతం క్లోరోఫిల్ లభిస్తుంది. ఇలా గోధుమ గడ్డి జ్యూస్ ను రోజూ తీసుకుంటే శరీరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. దీంతో గుండె, కిడ్నీలు, లివర్ శుభ్రంగా ఉంటాయి. రోగాలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
అలాగే బీట్‌రూట్ జ్యూస్‌ను రోజూ ఒక కప్పు మోతాదులో తాగుతున్నా కూడా శరీరం శుభ్రంగా మారుతుంది. వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అలాగే అనేక విటమిన్లు, మినరల్స్ కూడా లభిస్తాయి. ఇక చివరిగా రోజూ గ్రీన్ టీని తాగడం వల్ల కూడా శరీరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. బరువు తగ్గేలా చేస్తాయి. శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి. కనుక ఈ ఆహారాలను రోజూ తీసుకుంటే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు. వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. ఎంతో మేలు జరుగుతుంది. వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…