Sr NTR And Dasari : ప్రాణ స్నేహితులైన ఎన్‌టీఆర్‌, దాసరి.. అందుక‌నే శ‌త్రువులు అయ్యారా..?

Sr NTR And Dasari : నందమూరి తారకరామారావు 1949లో మనదేశం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనే స్థాయికి ఎదిగారు. తెలుగు వెండి తెర ఆరాధ్య దైవమయ్యారు. పౌరాణిక చిత్రాల్లో తిరుగులేని నటుడుగా ఎదిగారు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు శ‌త్రువులు పెద్ద‌గా ఎవ్వ‌రూ లేరు. అంద‌రూ ఆయ‌న‌తో స్నేహంగానే ఉండేవారు. అయితే ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రినారాయ‌ణ‌రావు మొదట ఎన్టీఆర్ కి ప్రాణ స్నేహితుడిగా ఉండేవార‌ట‌. ఏమైందో ఏమో తెలియ‌దు కానీ.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టే స‌మ‌యానికి వీళ్లిద్దరూ బద్ధశ‌త్రువులుగా మారిపోయార‌ని అప్ప‌ట్లో టాక్. అస‌లు దీనికి కారణం ఏంటంటే..

దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ చాలా సినిమాలే తీశారు. వీళ్ళు చాలా స‌న్నిహితంగానే ఉండేవారు. వీరి కాంబోలో స‌ర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి వంటి సూప‌ర్ హిట్ సినిమాలు వ‌చ్చాయి. దాస‌రి నారాయ‌ణ‌రావు తీసే సినిమాలు అన్న‌గారిని రాజ‌కీయంగా ప్రేరేపించాయి. ఇక్క‌డ విచిత్ర‌మేమిటంటే చిన్న‌త‌నం నుంచి దాస‌రికి ఏఎన్నార్ అంటే చాలా అభిమానం ఉండేద‌ట‌. ఆ త‌రువాత అక్కినేనితో గ్యాప్ రావ‌డంతో దాస‌రి, ఎన్టీఆర్ బంధం బ‌లప‌డింద‌ని చెబుతుంటారు. ఇక కొంత కాలానికే వీరి మ‌ధ్య వైరం పెరిగింది. ఆ స‌మ‌యంలో అస‌లు దాస‌రికి షూటింగ్ కోసం స్టూడియోలు కూడా ఇవ్వ‌వ‌ద్ద‌ని ఎన్టీఆర్ కొంద‌రికి చెప్పేవ‌ర‌కు వెళ్లింద‌ట‌.

Sr NTR And Dasari became enemies for this reason
Sr NTR And Dasari

ఎన్టీఆర్‌తో అనేక సినిమాలు తీసిన దాసరి నారాయ‌ణ‌రావుకి ఇలాంటి ప‌రిస్థితులు ఎదురవుతాయ‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేద‌ట‌. దాస‌రి ఇందిరా గాంధీకి పెద్ద ఫ్యాన్ అంట‌. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉండేవాడ‌ట‌. ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసిన‌ప్పుడు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఇందిర దాస‌రికి ఆఫ‌ర్ ఇచ్చార‌ని తెలుస్తోంది. అంతేకాదు.. ఈనాడు ప‌త్రిక‌లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా క‌థ‌నాలు వ‌స్తే.. దాస‌రి ఉద‌యం పత్రికను ప్రారంభించి ఎన్టీఆర్ కి వ్య‌తిరేకంగా వార్త‌లు రాయించార‌ట‌. ఎన్టీఆర్ రెండోసారి ఓడిపోవ‌డానికి దాస‌రి నారాయ‌ణ‌రావు కూడా ఓ కార‌ణ‌మ‌ని అప్ప‌ట్లో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అందుకే రాజకీయం ఎంతటి మిత్రులనైనా శత్రువులుగా మారుస్తుంది అంటారు.

Share
editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago