Chiranjeevi : చిరంజీవి వ‌దులుకున్న 8 బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలు ఇవే..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన స్వయంకృషితో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. 153 చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి కెరీర్ లో అధికశాతం చిత్రాలు సక్సెస్ ను సాధించాయి. ఆయన సినీ కెరీర్ లో  కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆగిపోగా, మరికొన్ని సినిమాలను రకరకాల కారణాలతో చిరంజీవే వదులుకోవడం జరిగింది.

ఇలా చిరంజీవి ఇప్పటివరకు ఎనిమిది సినిమాలను వదులుకున్నారు. వాటిలో ఒక్క సినిమా మాత్రం ఫ్లాప్ అవ్వగా, మరొక సినిమా సెట్స్ మీద ఉంది. ఇక మిగతా ఆరు చిత్రాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాయి. మరీ చిరంజీవి వదులుకొని  బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దామా. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మ‌న్నెంలో మొన‌గాడు సినిమాను మొదటిగా చిరంజీవి వ‌దులుకున్నారు. ద‌ర్శ‌కుడు కోడి రామకృష్ణ ఈ సినిమాను మొదట చిరంజీవితో చేయాల‌నుకున్నాడు. కానీ అప్ప‌టికే చిరంజీవికి స్టార్ హీరోగా ఇమేజ్ రావ‌డంతో ఆ పాత్ర త‌న‌కు సెట్ అవ్వ‌ద‌ని రిజెక్ట్ చేశాడు. ఇక ఆ అవకాశం యాక్ష‌న్ కింగ్ అర్జున్ చేతికి వెళ్లి సూప‌ర్ హిట్ అయింది.

Chiranjeevi rejected these 8 superhit movies or else
Chiranjeevi

వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వ‌నీద‌త్ మెగాస్టార్ చిరంజీవి, శ్రీ‌దేవిల క్రేజీ కాంబినేష‌న్ లో ఒక సినిమా నిర్మిద్దామ‌ని అనుకున్నారు. ఆ సమయంలో శ్రీ‌దేవి పాత్ర ఎక్కువ‌గా ఉండ‌డంతోపాటు, ఆమె పుల్ బిజీగా ఉండ‌డంతో ఆ సినిమా వ‌దులుకున్నారు చిరంజీవి. అలా ఆఖరి పోరాటం చిత్ర అవకాశం కాస్త నాగార్జునకి దక్కింది. ఈ చిత్రంతో నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.

ఇక ఈ చిత్రాలే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ నటించిన నెంబర్ వన్, మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ, వెంకటేష్ నటించిన సాహస వీరుడు సాగర కన్య, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి, త్వరలో ప్రేక్షకుల ముందుకు రవితేజ హీరోగా రాబోతున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రాలను చిరంజీవి వదులుకున్నారు. ఈ 8 చిత్రాల్లో ఆంధ్రావాలా డిజాస్టర్‌గా నిలవగా, టైగర్ నాగేశ్వరరావు సెట్స్ పైన ఉంది. ఇక మిగతా ఆరు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి. అలా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీల‌ను చిరంజీవి మిస్ చేసుకున్నారు.

Share
editor

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 month ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 month ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 month ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 month ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 month ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 month ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 month ago