ఆచార్య ఫెయిల్ అనంతరం మెగాస్టార్ చేసిన చిత్రాలు వరుసగా హిట్ అవుతున్నాయి. మళయాళం రీమేక్ గాడ్ ఫాదర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోగా.. ఇటీవల విడుదలైన వాల్తేర్ వీరయ్య కూడా సూపర్ హిట్ అయింది. మెగాస్టార్ చిరు, దర్శకుడు బాబీల కాంబినేషన్ లో ఈ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. యాక్షన్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీలో చిరు భిన్న గెటప్‌లో కనిపించి అలరించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ మూవీ రీసెంట్‌గా 25 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్‌తోపాటు మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక వాల్తేర్ వీరయ్యలో చిరు వింటేజ్ లుక్‌లో అలరించారు. మాస్ మహరాజా రవితేజ మరో కీలకపాత్రలో నటించి మెప్పించారు. దీంతో థియేటర్స్ లో ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేశాయి. ఇక ఇప్పటి వరకు థియేటర్లలో సందడి చేసిన వాల్తేర్ వీరయ్య మూవీ త్వరలో ఓటీటీలోనూ అలరించేందుకు సిద్ధమవుతోంది. ఓటీటీ రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు. వాల్తేర్ వీరయ్య డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో ఆ యాప్‌లోనే ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 27న వాల్తేర్ వీరయ్యను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.
ఇక వాల్తేరు వీరయ్య థియేట్రికల్ రిలీజ్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ సత్తా చాటింది. ఓటీటీలోనూ దూసుకుపోనుందని తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ తో పాటు జెమినీ సంస్థలు దక్కించుకున్నాయి. రూ.88 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక వాల్తేరు వీరయ్య ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ ను వసూల్ చేసింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లను సాధించింది.
యంగ్ డైరెక్టర్ బాబీ చిరంజీవికి పెద్ధ అభిమాని కావడం.. తన బాస్ ను ఎలా చూపించాలో అలా స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంతో ఫ్యాన్స్ థియేటర్లలో ఊగిపోయారు. ప్రస్తుతం ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ యాక్షన్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. శృతిహాసన్ కథానాయికగా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తమిళంలో అజిత్ నటించిన వేదాళం మూవీకి రీమేక్‌గా భోళా శంకర్‌ను తెరకెక్కిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…