కింగ్ నాగార్జున వైవిధ్య భరితమైన పాత్రలను చేయడంలో పెట్టింది పేరు. ఆయన ఎన్నో సినిమాల్లో డిఫరెంట్ రోల్స్‌లో నటించి అలరించారు. ఇక నాగార్జున నటించిన సినిమాల్లో అల్లరి అల్లుడు కూడా ఒకటి. ఇది ఓ వైపు పక్కా మాస్ తరహాలో సాగుతుంది. కానీ సెంటిమెంట్, ఫ్యామిలీ విలువలను కూడా చెబుతుంది. అందుకనే ఈ మూవీ ఆయన టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. శివ చిత్రం తరువాత నాగార్జున చేసిన భిన్నమైన మూవీ ఇది. ఈ క్రమంలోనే ఈ మూవీ ఆయనకు చక్కని హిట్‌ను అందించింది. ఆ తరువాత నాగార్జున మాస్ హీరోగా మరింత ఖ్యాతి సాధించారు.
ఇక అల్లరి అల్లుడు మూవీని తీయడం వెనుక పెద్ద కథే ఉంది. శివ తర్వాత విభిన్న తరహా మూవీస్ చేసిన నాగ్ కి నిర్ణయం, కిల్లర్ మూవీస్ తప్ప మిగిలినవేవీ హిట్ కాలేదు. అదే సమయంలో పక్కా మాస్ మూవీ ప్రెసిడెంట్ గారి పెళ్ళాం హిట్ ఇచ్చింది. దాంతో మాస్ కథలతో రావాలని ప్రొడ్యూసర్స్ కి చెప్పేశారు. ఇక అక్కినేని వీరాభిమాని డి శివప్రసాదరెడ్డి ఆలస్యం చేయకుండా ప్రెసిడెంట్ గారి పెళ్ళాం కథ రాసిన తోటపల్లి మధుకి మద్రాసులో ఓ రూమ్ తీసి, నాగ్ కి మంచి మాస్ కథ చేయమని చెప్పేశారు. దాంతో అత్తా అల్లుడు మధ్య సరదా సీన్స్ తో కథ రెడీ చేశారు. నిర్మాతకు, నాగ్ కి నచ్చేయడంతో కోదండరామిరెడ్డి డైరెక్టర్ గా సినిమాకు రెడీ అయ్యారు. మీనా, నగ్మా హీరోయిన్స్ . కీరవాణి మ్యూజిక్ అందించారు.
పొగరుబోతు అత్త పాత్రకు బ్రాండ్ అంబాసిడర్ గా నిల్చిన వాణిశ్రీ, మురళీమోహన్, రావు గోపాలరావు, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, చలపతిరావు ఇతర నటీనటులుగా చేశారు. 1993 ఏప్రిల్ లో షూటింగ్ స్టార్ట్ అయింది. చెన్నై ఏవీఎం స్టూడియో, ముదుమలై పార్క్, ఊటీ, హైదరాబాద్ అన్నపూర్ణ, పద్మాలయ స్టూడియోస్, రాజమండ్రిలలో షూటింగ్ చేశారు. చాలా టైటిల్స్ అనుకున్నా చివరకు అల్లరి అల్లుడు పేరుతో నాగ్ పుట్టినరోజు ఆగస్టు 29న పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ చేశారన్న వార్త సినిమాకు క్రేజ్ పెంచింది. ఆడియో హిట్. పాటలన్నీ మారుమోగాయి. అక్టోబర్ 6న మూవీ రిలీజ్. అప్పటికే బంగారు బుల్లోడు, అబ్బాయిగారు మంచి టాక్స్ తో హిట్ అయి థియేటర్లలో ఆడుతున్నాయి. దాంతో 72 ప్రింట్లతో 142 థియేటర్స్ లో అల్లరి అల్లుడు విడుదలైంది.
ఈ సినిమాకు ఫాన్స్ హడావిడి ఎక్కువ చేశారు. రాజమండ్రిలో 101 అడుగుల కటౌట్ పెట్టడంతో సంచలనంగా మారింది. కటౌట్ చూడ్డానికే థియేటర్ కి చాలామంది వచ్చేవారు. ఇక నాగ్ మాస్ యాక్టింగ్, మాస్ కామెడీ, ఫైట్స్ తో , స్టెప్స్ తో అదరగొట్టేశాడు. మీనా, నగ్మా గ్లామర్, వాణిశ్రీ, రావు గోపాలరావు యాక్టింగ్ ప్లస్ పాయింట్స్. మొదట్లో నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. కానీ నెమ్మదిగా పుంజుకుని హిట్ అయింది. మొదటి వారం రూ.1 కోటి 10 లక్షల షేర్ ను కలెక్ట్ చేయగా.. ఆయా జిల్లాల్లో, హైదరాబాద్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. బి సెంటర్స్ లో మొదటి వారం భారీ రికార్డ్స్ నమోదయ్యాయి. సీడెడ్ లో రూ.70 లక్షలు కలెక్ట్ చేసి రాయలసీమలో రికార్డ్ ను క్రియేట్ చేసింది. 22 సెంటర్స్ లో 100 డేస్ ఆడింది. టోటల్ గా రూ.7 కోట్ల 20 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. 1993 టాప్ గ్రాసర్ గా ఆల్ టైం టాప్ 4 మూవీగా నిలిచింది. నాగ్ మాస్ మూవీస్ కి ప్రధాన కారణం అల్లరి అల్లుడు హిట్ అవడమే అని చెప్పవచ్చు. ఆ తరువాత నాగ్ వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో మాస్ చిత్రాలతో అలరించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…