Bimbisara : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కొన్నాళ్లుగా సరైన సక్సెస్‌లు లేక నీరసించి పోయిన సమయంలో బింబిసార చిత్రం విడుదలై పెద్ద విజయం సాధించింది. ఫాంటసీ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ మూవీకి మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తొలిసారిగా చక్రవర్తి పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్ అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ద్విపాత్రాభినయంతో అభిమానుల మనసులు కొల్లగొట్టాడు.
దర్శకుడు మల్లిడి వశిష్ఠ కూడా ప్రతి ఫ్రేమ్ ను ఆసక్తికరంగా చిత్రీకరించడంతో సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కింది. ఇందులో భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్.. కేథరిన్ కీలకపాత్రలలో నటించారు. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యంత ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రాబోతుందా ? అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మరోవైపు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం కార్తికేయ 2 సైతం జీ5లో అక్టోబర్ 5న స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో బింబిసార చిత్రాన్ని అక్టోబర్ 7న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు సమాచారం. కళ్యాణ్‌రామ్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన సినిమాగా బింబిసార రికార్డుల్లో నిలిచిపోయింది. రూ.65 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టిన బింబిసార రూ.35 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమా కొన్ని సెంటర్లలో రన్ అవుతోంది. అతి త్వరలో ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…