Srihari : రియల్ స్టార్ శ్రీహరి వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. సినిమానే ప్రాణంగా బ్రతికిన ఆయన సినిమా షూటింగ్ సమయంలో కన్నుమూయడం బాధాకరం. ఎన్నో సినిమాలు చేసిన శ్రీహరి తాను సంపాదించింది ఏమీ లేదు. ఎక్కువగా దాన ధర్మాలకే ఖర్చు పెట్టాడు. ఇక చాలా మంది ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కూడా ఇవ్వకుండా మోసం చేశారంటూ తాజాగా డిస్కో శాంతి సంచలన వ్యాఖ్యలు చేసింది. మాకు రెమ్యూనరేషన్ కరెక్ట్ గా వచ్చి ఉంటే నేను ఒక పది ఇళ్లను కొని ఉండేదాన్ని అని ఆమె వాపోయారు.
శ్రీహరి చనిపోయిన తర్వాత అప్పులు ఉంటే నగలన్నీ అమ్మేసి తీర్చేశాను అని అలాగే కార్లు కూడా అమ్మేశాను అని వివరించారు. శ్రీహరి సినిమాలో నటించే సమయంలో చిరంజీవి గారి సంస్థ అలాగే రెండు మూడు సంస్థలు మాత్రమే రెమ్యూనరేషన్ కరెక్ట్ గా ఇచ్చేవారన్నారు. శ్రీహరి బావకి సినిమా అంటే పిచ్చి ఉండడంతో డబ్బులు ఇవ్వకపోయినా సినిమాలు చేసే వారు. శ్రీహరి ఉన్నప్పుడు అందరూ తమ ఇంటికి వచ్చే వారని కానీ ఇప్పుడు పట్టించుకునే వారు లేరన్నారు.
బాలకృష్ణ అప్పట్లో ఫోన్ చేసి మా బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఏమన్నా సాయం కావాలా అని అడిగారు. ఆ మధ్య నా భర్త ఏకంగా రూ.500 కోట్లు సంపాదించి పెట్టి వెళ్లిపోయాడు అంటూ కొన్ని మీడియా సంస్థలు రాశారు. అది చూసి బాధ పడ్డానని చెప్పింది డిస్కో శాంతి. నిజంగానే శ్రీహరి తనకు రూ.500 కోట్ల ఆస్తులను ఇచ్చాడని నిరూపిస్తే.. అందులో రూ.300 కోట్లు వాళ్లకే ఇచ్చేస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఏదేమైనా భర్త చనిపోయిన తర్వాత తమ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి తన ఆస్తులను తాకట్టు పెట్టడం అందరినీ బాధిస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…