Bimbisara : కళ్యాణ్ రామ్ కెరీర్‌కి మంచి బూస్టప్ ఇచ్చిన చిత్రం బింబిసార. మల్లాడి వశిష్ఠ దర్శకత్వం వహింంచిన ఈ సినిమా ఎలాంటి అంచనాల్లేకుండా ఆగస్టు 5న విడులై సంచలన విజయం సాధించింది. రిలీజైన ఫస్ట్ వీక్‌లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోగా, కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్‌లను సాధించిన చిత్రంగా ‘బింబిసార’ నిలిచింది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కగా, డ్యూయల్ రోల్‌లో కళ్యాణ్‌రామ్ అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓటీటీలోనూ ఈ చిత్రం దూసుకుపోతుంది. అక్టోబర్ 21నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం డిజిటల్‌లోనూ ఘన విజయం సాధించింది. ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో కళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథరీన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్‌లుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్స్ట్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రస్తుతం ‘బింబిసార-2’ స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా, అన్ని కుదిరితే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉంది.
అయితే ఈ సినిమా కథను మొదట రవితేజకు వినిపించగా ఆయన రిజెక్ట్ చేశారట. అసలు ఈ సినిమా ను మొదట బాలయ్యతో చేయాలని కూడా దర్శకుడు అనుకున్నాడట. అయితే ఫస్ట్ హాఫ్ లో హీరో క్రూరత్వం ప్రదర్శిస్తాడు. అలాంటి పాత్ర చేస్తే బాలయ్య ఇమేజ్ కు సెట్ అవతుందో లేదో అని కూడా ఆలోచించారట. హీరోగా, విలన్‌గా నటిస్తే బాలయ్య ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించిన మేకర్స్ కళ్యాణ్ రామ్ కి కథ చెప్పడం ఆయన ఓకే చేయడం సినిమా హిట్ అవ్వడం వెంటవెంటనే జరిగిపోయాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…