Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ సీజ‌న్ 6 సంద‌డి షురూ.. ఈసారి కంటెస్టెంట్స్ ఎంత మంది.. ఎవ‌రు.. అంటే..?

Bigg Boss Telugu 6 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం తెలుగులో నాన్‌స్టాప్‌గా దూసుకుపోతుంది. ఇప్ప‌టికే ఐదు సీజ‌న్స్‌తోపాటు ఒక నాన్‌స్టాప్ షో కూడా జ‌రుపుకుంది. వీట‌న్నింటికి మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో తాజాగా ఆరో సీజ‌న్ కూడా మొద‌లు పెట్టారు. ఆరో సీజ‌న్ గ్రాండ్‌గా మొద‌లు కాగా, ఇందులో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. ఇక వీరు చేసే ర‌చ్చ పీక్స్‌లో ఉంటుంద‌ని తెలుస్తుంది. వంద రోజుల పాటు వీరు బిగ్ బాస్‌లో తెగ సంద‌డి చేయ‌బోతున్నారు.

ఇక కంటెస్టెంట్స్ విష‌యానికి వ‌స్తే.. తొలి కంటెస్టెంట్‌గా  కార్తీకదీపం, మనసిచ్చి చూడు ఫేమ్ కీర్తి భట్ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టింది. రెండో కంటెస్టెంట్‌గా నువ్వునాకు నచ్చావు ఫేమ్‌ పింకీ అలియాస్ సుదీప, మూడో కంటెస్టెంట్‌గా సిరి ప్రియుడు శ్రీహాన్.. నాలుగో కంటెస్టెంట్‌గా యాంకర్ నేహా చౌదరి.. ఐదో కంటెస్టెంట్‌గా జబర్దస్త్ చలాకీ చంటి, ఆరో కంటెస్టెంట్‌గా సీరియల్ నటి శ్రీ సత్య.. ఏడో కంటెస్టెంట్‌గా హీరో అర్జున్ కళ్యాణ్.. ఎనిమిదో కంటెస్టెంట్‌గా గీతూ రాయల్ అలియాస్ గలాటా గీతు.. తొమ్మిదో కంటెస్టెం‌ట్‌గా అభినయ శ్రీ ఎంట్రీ ఇచ్చారు.

Bigg Boss Telugu 6 started who are the contestants for this season
Bigg Boss Telugu 6

ఈ సారి రియ‌ల్ లైఫ్ క‌పుల్ కూడా బిగ్ బాస్ హౌజ్‌లో సండి చేయ‌బోతున్నారు. పది, 11వ కంటెస్టెంట్స్ గా రోహిత్- మెరీనా జంట బ్యూటిఫుల్ సాంగ్ పెర్ఫామెన్స్‌తో ఎంట్రీ ఇచ్చారు. వ‌రుణ్‌, వితికా మాదిరిగా వీరు కూడా సంద‌డి చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. 12వ కంటెస్టెంట్‌గా నటుడు బాలాదిత్య.. 13వ కంటెస్టెంట్‌గా బ్యూటిఫుల్ లేడీ వాసంతి కృష్ణన్, 14వ కంటెస్టెంట్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ షానీ అలియాస్ సాల్మన్.. 15వ కంటెస్టెంట్‌గా ఆర్జీవీ హీరోయిన్ ఇనయ సుల్తాన..16వ కంటెస్టెంట్‌గా ఆర్జే సూర్య ..17వ కంటెస్టెంట్‌గా జబర్దస్త్ ఫైమా..18వ కంటెస్టెంట్‌గా యూట్యూబర్ ఆదిరెడ్డి ,19వ‌ కంటెస్టెంట్‌గా మోడల్ రాజశేఖర్, 20వ కంటెస్టెంట్‌గా టీవీ 9 యాంకర్ ఆరోహి రావ్ అలియాస్ ఇస్మార్ట్ అంజలి, 21వ కంటెస్టెంట్ గా సింగర్ రేవంత్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరు ఏ రేంజ్‌లో ఎంట‌ర్‌టైన్ మెంట్‌ అందించ‌నున్నారో అని ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago