Benerjee : మా ఎన్నికల సమయంలో మోహన్ బాబు వీర విహారం సృష్టించిన విషయం తెలిసిందే. ఎన్నికలలో మంచు విష్ణు పోటీ చేసినా హంగామా మాత్రం మోహన్ బాబుదే నడిచింది. ఒకొక్కరినీ బెదిరిస్తూ దూషిస్తూ నానా హంగామా చేశాడు. ముఖ్యంగా సీనియర్ నటుడు బెనర్జీని చెప్పుకోలేని విధంగా దూషించాడట. ఈ విషయాన్ని ఎన్నికల సమయంలోనే ప్రస్తావించాడు బెనర్జీ. అందరి ముందు మోహన్ బాబు అన్ని బూతులు తిడుతుంటే బాధ కలిగిందని ఆయన అన్నారు. మా వాళ్లంతా అప్పడు అందరూ దూరదూరంగా ఉన్నారు.
అది చూసి వాళ్లు అలా ప్రవర్తించడంతో చాలా బాధ కలిగిందని అన్నారు. మోహన్ బాబు కుటుంబంతో మంచి అనుబంధం ఉందని.. మోహన్ బాబు ఇంటికి వెళ్లేంత చనువు ఉందని అన్నారు. లక్ష్మి పుట్టినప్పటి నుంచి ఆమెను ఎత్తుకుని తిరిగానని, మోహన్ బాబు ఇంటి మనిషిలా ఉండేవాడిని అలాంటిది ఆయన ఆ రోజు ఆలా తిట్టడంతో షాక్ అయ్యానని బెనర్జీ ఎలక్షన్స్ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇక తాజాగా ఇదే విషయంపై ఆయన మరోసారి ఓపెన్ అయ్యారు. తొలి నుంచి కూడా నేను వివాదాలకు దూరంగానే ఉంటూ వస్తున్నాను. చిరంజీవి వల్ల తాను మా ఎన్నికల్లో పాల్గొన్నానని చెప్పారు బెనర్జీ.
ప్రకాశ్ రాజ్ ఎంతో కొంత మంచి చేస్తాడని చిరంజీవి నమ్మారని.. మోహన్ బాబుతో మాట్లాడి ప్రకాశ్ రాజ్ ని ఓకే చేశారని తెలిపారు. అయితే ప్రకాశ్ రాజ్ నిలబడిన తర్వాత మంచు విష్ణును మోహన్ బాబు నిలబెట్టారని చెప్పారు. ఎన్నికల సమయంలో మోహన్ బాబు తన చెంప మీద కొట్టిన ఘటనపై స్పందిస్తూ బెనర్జీ కంటతడి పెట్టుకున్నారు. మోహన్ బాబు సంస్కారం ఏమిటో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. స్టయిల్ కోసం 50 ఏళ్ల వయసులో సిగరెట్ తాగడాన్ని నేర్చుకున్నానని చెప్పిన ఆయన ఎన్ని సినిమాలు చేశాననే విషయాన్ని లెక్క పెట్టుకోవడం, అవార్డులను ఇంట్లో పెట్టుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…