Samantha Father : ఏ మాయ చేశావే చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసులతోపాటు అక్కినేని నాగ చైతన్య మనసుని దోచుకుంది అందాల ముద్దుగుమ్మ సమంత. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న ఈ జంట ఎవరూ ఊహించని విధంగా గత ఏడాది విడాకులు తీసుకున్నారు. వారి నిర్ణయం అందరికి పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. చైతూతో విడిపోయాక సమంత ముంబైలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఎవరి కెరీర్ లో వారు బిజీ అయిపోయారు. అయితే తాజాగా సమంత తండ్రి చేసిన హార్ట్ బ్రేకింగ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఒక వెడ్డింగ్‌కి హాజరయ్యారు. ఆ వెడ్డింగ్ పిక్స్ తన ఫేస్ బుక్ పేజ్‌లో షేర్ చేస్తూ.. ఇది చాలా కాలం నాటి కధ. ఆ కథ కథలాగే మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్త కథ కొత్త అధ్యాయం మొదలు అంటూ తన ఫ్యామిలీలో జరిగిన ఓ మ్యారేజ్ కి సంబందించిన పిక్స్ షేర్ చేశారు జోసెఫ్. అలాగే సమంత, నాగ చైతన్య పిక్స్ కూడా షేర్ చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నాగ చైతన్య, సమంత అభిమానులు ఈ పోస్ట్ ని షేర్ చేస్తూ హార్ట్ బ్రేకింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సడెన్‌గా జోసెఫ్ తన కూతురు పెళ్లి నాటి పిక్స్ షేర్ చేయడం వెనక కారణం ఏమై ఉంటుందంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, సమంత- నాగ చైతన్య విడాకుల తర్వాత స్పందించిన జోసెఫ్.. తన కూతురు విడాకులు గురించి తెలిశాకా తనకేమీ తోచలేదని, మైండ్ బ్లాంక్ అయ్యిందని తెలిపారు. సమంత స్పృహలో ఉండే ఈ నిర్ణయం తీసుకుందన్న జోసెఫ్.. త్వరలోనే పరిస్థితులు అన్నీ సద్దుమణుగుతాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. సమంత విడాకులు ప్రకటించినప్పటి నుండి ఆమె దారుణమైన ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…