Charmy Kaur : అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన విజయ్ దేవరకొండ రీసెంట్‌గా లైగర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాని డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించగా, మైక్ టైసన్ వంటి ఇంటర్నేషనల్ నటుడు ప్రధాన పాత్ర పోషించారు. సినిమాని భారీ రేంజ్‌లో తెరకెక్కించడంతో చిత్రంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. రిలీజ్ కు ముందుకు భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. నెగెటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఫలితంగా నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చి పెట్టింది. చిత్రాన్ని పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్లపై నిర్మాత కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ కలిసి నిర్మించారు. చిత్రాన్ని రూ.90 నుంచి రూ.125 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా, ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోంది.
ప్రమోషన్స్ లో భాగంగా లైగర్ ఓ రేంజ్ లో ఉంటుందని చిత్ర బృందం తెగ ప్రచారాలు చేయగా, ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ కావడంతో భారీగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ప్రెస్ మీట్స్‌లో, సోషల్ మీడియా వేదికగా విజయ్, ఛార్మి, పూరీ జగన్నాథ్‌లని ఏకి పారేస్తున్నారు. ఈ క్రమంలో ఛార్మీ కౌర్ అనూహ్యంగా నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆమె ఓ ట్వీట్ చేసింది. గయ్స్ కాస్త శాంతించండి. సోషల్ మీడియా నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నా.. పూరీ కనెక్ట్స్ మరింత దృఢంగా, మెరుగ్గా మళ్లీ తిరిగొస్తుంది. అప్పటి వరకు బ్రతకండి. బ్రతకనివ్వండి.. అంటూ హార్ట్ ఎమోజీని జత చేసి ఛార్మీ ట్వీట్ చేసింది.
లైగర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఛార్మి చేస్తోన్న జనగణమన సినిమా సైతం ఆగిపోయిందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఒక ప్రొడ్యూసర్ తప్పుకున్నాడని, విజయ్ దేవరకొండ కూడా సినిమాపై అంత ఆసక్తి చూపడం లేదనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మరి ఈ విషయాలపై ఇంత వరకు ఎవరు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైన పూరీ, ఛార్మీలకు ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన జోష్ లైగర్ తుడిచి పెట్టేసిందనే చెప్పాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…