Samantha : ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిపోతుంది సమంత. ఆమె కెరియర్ ఈ స్థాయికి రావడంలో చిన్మయి కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. ఏమాయ చేశావే సినిమాలో సమంత పాత్రకి చిన్మయి డబ్బింగ్ చెప్పింది. అందులో ఆమె పాత్రతో పాటు వాయిస్ కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. చిన్మయి వాయిస్ చాలా క్యాచీగా ఉండడంతోపాటు సమంత నటన అందరిని మెప్పించడంతో అప్పటి నుండి ఈ కాంబినేషన్ ని అందరూ ఇష్టపడడం మొదలు పెట్టారు. అప్పట్నుంచే వీరి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఏర్పడింది.
చిన్మయిపై ఎవరైనా తప్పుడు కామెంట్స్ చేస్తే సమంత వెంటనే స్పందించేది. అలాగే సమంతని ఎవరైనా ఏమన్నా అన్నా కూడా చిన్మయి వెంటనే రియాక్ట్ అయ్యేది. ఆ మధ్య పూజ హెగ్డే.. సమంత వివాదంలో కూడా చిన్మయి సామ్ కి సపోర్ట్ చేస్తూ ఇండైరెక్ట్ గా పూజని ఏకి పారేసింది. మరోవైపు చిన్మయి మీటూ ఆరోపణలు చేసినప్పుడు సామ్ బహిరంగంగా తన స్నేహితురాలికి మద్దతు పలికింది. అలాగే ఫ్యామిలీ మ్యాన్ -2 వెబ్ సిరీస్ విషయంలో సామ్‌ని పలువురు విమర్శించినప్పుడు ఈ స్టార్ సింగర్ సమంతకు సపోర్టుగా నిలబడింది.
ఇలా ఒకరికొకరు పలు సందర్భాలలో సపోర్ట్‌గా నిలిచారు. అయితే ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య దూరం ఎక్కువైనట్టు కనిపిస్తుంది. సమంత తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. చిన్మయి కూడా ఇటీవల సమంత గురించి ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. దీంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని కొందరు పుకార్లు పుట్టించారు. తాజాగా దీనిపై స్పందించిన చిన్మయి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తామిద్దరం కలుసుకున్న ప్రతిసారీ సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టడం కుదరదని, అలా ఫొటోలు పెట్టనంత మాత్రాన విడిపోయినట్టు కాదని స్పష్టం చేసింది. తనకు తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఊపందుకోవడానికి సమంతే కారణమని, అయితే ఇప్పుడు సమంతకు తన వాయిస్ అవసరంలేదని పేర్కొంది. సమంతే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న నేపథ్యంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సమంతతో తన ప్రయాణం ముగిసినట్టేనని చిన్మయి వెల్లడించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…