Bhagavanth Kesari : బాల‌య్య అరాచ‌కం.. భ‌గ‌వంత్ కేస‌రి ప్రీ రిలీజ్ రూ.287 కోట్లా..!

Bhagavanth Kesari : బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ భగవంత్ కేసరి. దసరా కానుక‌గా ఈ చిత్రం అక్టోబ‌ర్ 19న విడుద‌లైంది. అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ బాలకృష్ణ హీరోగా రావడంతో ఈ మూవీపై మొదటి నుంచి భారీగానే అంచనాలున్నాయి. బాలకృష్ణ పేరు చెప్పగానే మాస్ కథాంశం, భీకరమైన ఫైట్లు, స్క్రీన్ నిండా రక్తపాతం.. కాని దర్శకుడు అనిల్ రావిపూడి పేరు చెప్పగానే కామెడీ కంటెంట్, కడుపుబ్బా నవ్వించి కడుపునొప్పితో థియేటర్ నుంచి బయటకు రావడమే గుర్తొస్తుంది. మ‌రి వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన భ‌గ‌వంత్ కేస‌రి చిత్రం మంచి హిట్ అయింది. ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతుంది.

తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానంగా రూపొందిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కంటతడి పెట్టాల్సిందేనని బాలకృష్ణ ఓ ఈవెంట్ లో చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. కామెడీ, యాక్షన్ తో పాటు ఈ సినిమాలో ఎమోషన్ కూడా చాలా కనెక్ట్ అవుతుంది. అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే అంద‌రికి చెమ‌ట‌లు కార‌డం ఖాయం. థియేట్రిక‌ల్ రైట్స్ 68 కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు తెలుస్తుండ‌గా, అర‌వై తొమ్మిది కోట్ల‌ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. వీర‌సింహారెడ్డి, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు త‌ర్వాత బాల‌కృష్ణ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా భ‌గ‌వంత్ కేస‌రి రికార్డ్ క్రియేట్ చేసింది.

Bhagavanth Kesari movie pre release details
Bhagavanth Kesari

టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఇప్పుడు ఏకంగా 287 కోట్ల బిజినెస్ మార్క్ ని దాటేయడం విశేషం అని చెప్పాలి.భ‌గ‌వంత్ కేస‌రి 68 కోట్లు కాగా, వీర‌సింహారెడ్డి 73 కోట్లు, అఖండ 53 కోట్లు, రూల‌ర్ 23.75 కోట్లు, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు 70.60 కోట్లు, జై సింహ 26 కోట్లు, పైసా వ‌సూల్ 32.5 కోట్లు , గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి- 46 కోట్లు ఇలా బాలయ్య రీసెంట్ టైంలో నటించిన సినిమాల బిజినెస్ లెక్కలు చూసి అందరు షాక్ అవుతున్నారు. ఈ చిత్రం మొద‌టి రోజు మంచి వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తుంది. మొదటి రోజు మార్నింగ్ షోకు హైదరాబాద్ లో 65 శాతం ఆక్యుపెన్సీ వచ్చినట్లు మార్కెట్ వర్గాల సమాచారం. బెంగళూరు లో మార్నింగ్ షో 66 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది. విజయవాడలో 81 శాతం ఆక్యుపెన్సీ, గుంటూరు లో 90 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది. విశాఖపట్నంలో 68 శాతం, కాకినాడలో 67 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago