Bhagavanth Kesari : బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ భగవంత్ కేసరి. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదలైంది. అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ బాలకృష్ణ హీరోగా రావడంతో ఈ మూవీపై మొదటి నుంచి భారీగానే అంచనాలున్నాయి. బాలకృష్ణ పేరు చెప్పగానే మాస్ కథాంశం, భీకరమైన ఫైట్లు, స్క్రీన్ నిండా రక్తపాతం.. కాని దర్శకుడు అనిల్ రావిపూడి పేరు చెప్పగానే కామెడీ కంటెంట్, కడుపుబ్బా నవ్వించి కడుపునొప్పితో థియేటర్ నుంచి బయటకు రావడమే గుర్తొస్తుంది. మరి వీరిద్దరి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి చిత్రం మంచి హిట్ అయింది. ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతుంది.
తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానంగా రూపొందిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కంటతడి పెట్టాల్సిందేనని బాలకృష్ణ ఓ ఈవెంట్ లో చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. కామెడీ, యాక్షన్ తో పాటు ఈ సినిమాలో ఎమోషన్ కూడా చాలా కనెక్ట్ అవుతుంది. అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే అందరికి చెమటలు కారడం ఖాయం. థియేట్రికల్ రైట్స్ 68 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుండగా, అరవై తొమ్మిది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీరసింహారెడ్డి, ఎన్టీఆర్ కథానాయకుడు తర్వాత బాలకృష్ణ కెరీర్‌లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా భగవంత్ కేసరి రికార్డ్ క్రియేట్ చేసింది.
టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఇప్పుడు ఏకంగా 287 కోట్ల బిజినెస్ మార్క్ ని దాటేయడం విశేషం అని చెప్పాలి.భగవంత్ కేసరి 68 కోట్లు కాగా, వీరసింహారెడ్డి 73 కోట్లు, అఖండ 53 కోట్లు, రూలర్ 23.75 కోట్లు, ఎన్టీఆర్ కథానాయకుడు 70.60 కోట్లు, జై సింహ 26 కోట్లు, పైసా వసూల్ 32.5 కోట్లు , గౌతమి పుత్ర శాతకర్ణి- 46 కోట్లు ఇలా బాలయ్య రీసెంట్ టైంలో నటించిన సినిమాల బిజినెస్ లెక్కలు చూసి అందరు షాక్ అవుతున్నారు. ఈ చిత్రం మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది. మొదటి రోజు మార్నింగ్ షోకు హైదరాబాద్ లో 65 శాతం ఆక్యుపెన్సీ వచ్చినట్లు మార్కెట్ వర్గాల సమాచారం. బెంగళూరు లో మార్నింగ్ షో 66 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది. విజయవాడలో 81 శాతం ఆక్యుపెన్సీ, గుంటూరు లో 90 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది. విశాఖపట్నంలో 68 శాతం, కాకినాడలో 67 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.