Irfan Pathan : నాపై రాళ్లు వేశారు.. జై శ్రీరామ్ అంటే త‌ప్పేంట‌న్న ఇర్ఫాన్ ప‌ఠాన్‌..

Irfan Pathan : పాకిస్తాన్‌తో వ‌ర‌ల్డ్ క‌ప్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన పాకిస్థాన్.. గ్రౌండ్లో ఫ్యాన్స్ అల్లరి చేశారని, పాకిస్థాన్ పాటలు వేయకపోవటం కూడా ఓటమికి కారణమంటూ తొండాట ఆడే ప్రయత్నం చేసింది. దీంతో పాకిస్థాన్ వైఖరి మీద.. పాక్ మాజీ ప్లేయర్లతో పాటు పలువురు వెటరన్ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.. డానిష్ కనేరియా వంటి పాకిస్థాన్ మాజీ ప్లేయర్లతో పాటు.. ఇండియా వెటరన్ ప్లేయర్లు కూడా పాకిస్థాన్ వైఖరి సరిగా లేదంటున్నారు.తాజాగా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ పీసీబీ తీరుపై మండిపడ్డాడు.

గతంలో తనకు జరిగిన అనుభవాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన పఠాన్.. అప్పుడు మేము ఇలా ఏడుస్తూ కూర్చోలేదంటూ పాకిస్థాన్‌ జట్టు మీద సెటైర్లు వేశాడు. 2003-04లో ఇండియన్ టీమ్ పాకిస్థాన్‌లో పర్యటించిన సమయంలో జరిగిన సంగతిని ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తావించాడు. ఎక్స్‌లో దీని గురించి రాసుకొచ్చాడు. 2003-04లో తొలిసారిగా టీమిండియాతో కలిసి పాకిస్థాన్ పర్యటనకు వెళ్లానన్న పఠాన్.. ఆ సందర్భంగా అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించిందన్నాడు. అయితే ఆ పర్యటనలో సాదర స్వాగతాలతో పాటుగాకొన్ని చేదు అనుభవాలు కూడా ఉన్నాయని అన్నాడు.. కొంతమంది ఫ్యాన్స్ రాళ్లు, ఐరన్ బోల్ట్‌లు విసిరారన్న పఠాన్.. అయితే అలాంటి దురదృష్టకరమైన ఘటనలు పట్టుకుని టీమిండియా ఏడుస్తూ కూర్చోలేదన్నాడు.

Irfan Pathan told what really happened at that time
Irfan Pathan

అభిమానులు విసిరిన వస్తువు కారణంగా తన కంటి వద్ద తగిలిన గాయాన్ని అంపైర్‌కు చూపుతున్న ఫోటోను, దానికి సంబంధించిన వార్తాకథనాన్ని సైతం పఠాన్ ట్వీట్‌కు జతచేశాడు. ఇండియా చేతిలో ఘోర ఓటమి తర్వాత పాకిస్థాన్ అభిమానుల నుంచి ఎదురయ్యే విమర్శలను తప్పించుకునేందుకు పీసీబీ అనేక ప్రయత్నాలు చేసింది. ఐసీసీ ఈవెంట్‌లా లేదని, బీసీసీఐ ఈవెంట్లా ఉందని పాక్ టీమ్ డైరెక్టర్ మికీ ఆర్థర్ ఆరోపించాడు. ఇక పీసీబీ అయితే ఏకంగా నరేంద్ర మోదీ స్టేడియంలోని అభిమానుల ప్రవర్తన మీద కూడా ఐసీసీ వరకూ వెళ్లి ఫిర్యాదు చేసింది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago