Irfan Pathan : పాకిస్తాన్‌తో వరల్డ్ కప్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన పాకిస్థాన్.. గ్రౌండ్లో ఫ్యాన్స్ అల్లరి చేశారని, పాకిస్థాన్ పాటలు వేయకపోవటం కూడా ఓటమికి కారణమంటూ తొండాట ఆడే ప్రయత్నం చేసింది. దీంతో పాకిస్థాన్ వైఖరి మీద.. పాక్ మాజీ ప్లేయర్లతో పాటు పలువురు వెటరన్ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.. డానిష్ కనేరియా వంటి పాకిస్థాన్ మాజీ ప్లేయర్లతో పాటు.. ఇండియా వెటరన్ ప్లేయర్లు కూడా పాకిస్థాన్ వైఖరి సరిగా లేదంటున్నారు.తాజాగా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ పీసీబీ తీరుపై మండిపడ్డాడు.
గతంలో తనకు జరిగిన అనుభవాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన పఠాన్.. అప్పుడు మేము ఇలా ఏడుస్తూ కూర్చోలేదంటూ పాకిస్థాన్ జట్టు మీద సెటైర్లు వేశాడు. 2003-04లో ఇండియన్ టీమ్ పాకిస్థాన్‌లో పర్యటించిన సమయంలో జరిగిన సంగతిని ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తావించాడు. ఎక్స్‌లో దీని గురించి రాసుకొచ్చాడు. 2003-04లో తొలిసారిగా టీమిండియాతో కలిసి పాకిస్థాన్ పర్యటనకు వెళ్లానన్న పఠాన్.. ఆ సందర్భంగా అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించిందన్నాడు. అయితే ఆ పర్యటనలో సాదర స్వాగతాలతో పాటుగాకొన్ని చేదు అనుభవాలు కూడా ఉన్నాయని అన్నాడు.. కొంతమంది ఫ్యాన్స్ రాళ్లు, ఐరన్ బోల్ట్‌లు విసిరారన్న పఠాన్.. అయితే అలాంటి దురదృష్టకరమైన ఘటనలు పట్టుకుని టీమిండియా ఏడుస్తూ కూర్చోలేదన్నాడు.
అభిమానులు విసిరిన వస్తువు కారణంగా తన కంటి వద్ద తగిలిన గాయాన్ని అంపైర్‌కు చూపుతున్న ఫోటోను, దానికి సంబంధించిన వార్తాకథనాన్ని సైతం పఠాన్ ట్వీట్‌కు జతచేశాడు. ఇండియా చేతిలో ఘోర ఓటమి తర్వాత పాకిస్థాన్ అభిమానుల నుంచి ఎదురయ్యే విమర్శలను తప్పించుకునేందుకు పీసీబీ అనేక ప్రయత్నాలు చేసింది. ఐసీసీ ఈవెంట్‌లా లేదని, బీసీసీఐ ఈవెంట్లా ఉందని పాక్ టీమ్ డైరెక్టర్ మికీ ఆర్థర్ ఆరోపించాడు. ఇక పీసీబీ అయితే ఏకంగా నరేంద్ర మోదీ స్టేడియంలోని అభిమానుల ప్రవర్తన మీద కూడా ఐసీసీ వరకూ వెళ్లి ఫిర్యాదు చేసింది.