Vallabhaneni Vamshi : టీడీపీకి ఎన్టీఆర్‌కి ఎక్క‌డ చెడిందంటే.. క్లారిటీ ఇచ్చిన వ‌ల్ల‌భ‌నేని..!

Vallabhaneni Vamshi : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి దాదాపు నెల రోజుల పైనే అయింది. చంద్ర‌బాబు అరెస్ట్ ని ని ఖండిస్తూ చంద్రబాబుకి చాలా మంది మద్దతు తెలిపారు. తమిళ్ హీరో రజినీకాంత్, విశాల్ కూడా చంద్రబాబు అరెస్ట్ ని ఖండిస్తూ రియాక్ట్ అయ్యారు. అయితే తెలుగు హీరో, నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు దీని పై స్పందించలేదు. దీంతో ఎన్టీఆర్ తీరు పై పలువురు టీడీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయినప్ప‌టికీ కూడా ఎన్టీఆర్ మాత్రం మౌనం వహిస్తూనే వస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ మౌనం వెనుక కారణానికి.. పలు కారణాలు చెబుతూ అభిమానులు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్‌గా ఎన్టీఆర్ మిత్రుడు, యాక్టర్ రాజీవ్ కనకాల.. ఎన్టీఆర్ మౌనానికి గల కారణం ఏంటో తెలియజేసాడు.

ఎన్టీఆర్ కి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కరోనా, ఆర్ఆర్ఆర్ వల్ల తన కెరీర్ లో నాలుగేళ్లు పైగా టైం పోయింది. ఆ గ్యాప్ లో తను మరో మూడు సినిమాలు చేసేవాడు. ఇప్పుడు దేవరని కంప్లీట్ చేసే బిజీలో ఉన్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలు పైనే ఉంది. వాటితో బిజీ అవ్వడం వలనే రాజకీయాలు గురించి స్పందించడం లేదని అనుకుంటున్నాను అని అన్నాడు. ఇక టీడీపీ నుండి వైసీపీ గూటికి చేరిన వ‌ల్ల‌భ‌నేని వంశీ అస‌లు ఎన్టీఆర్‌కి, టీడీపీకి మ‌ధ్య ఎందుకు గ్యాప్ వ‌చ్చిందో తెలియ‌జేశాడు. 2009 ఎన్నికల్లో టిడిపి తరఫున ప్రచారం చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాత తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు.బాల‌కృష్ణ కూడా ఎన్టీఆర్‌తో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.

Vallabhaneni Vamshi given clarity on tdp and jr ntr issue
Vallabhaneni Vamshi

అభిమానులు కూడా స‌పరేట్ కావ‌డం, ప్ర‌త్యేకంగా ఎన్టీఆర్ జెండాలు క‌నిపించ‌డం ఎన్టీఆర్ కి , తెలుగుదేశం పార్టీకి మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయన్న విషయం అర్థమైంది. అసలు ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్న విభేదాలకు గల కారణం ఇది అంటూ ఎన్టీఆర్ కి సన్నిహితుడు, తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు వల్లభనేని వంశీ మోహన్ తెలిపారు. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం అయిన తర్వాత ఎన్టీఆర్ ప్రచారం చేసిన ప్రతి చోటా టిడిపి ఓడిపోయింది అని ఆర్టికల్ రాయించారని, దాని వల్ల ఎన్టీఆర్ తీవ్రంగా మనస్థాపం చెందారని అన్నారు. 2014 ఎన్నికల్లో కనీసం ఎన్టీఆర్ తో మాట్లాడటం గాని ప్రచారానికి పిలవడం వంటివి ఏమి చేయ‌లేదు. ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్‌గా ఉంటే త‌న కొడుకు నారా లోకేష్‌కి భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని భావించిన చంద్ర‌బాబు కావాల‌నే ఎన్టీఆర్‌ని దూరం పెట్టాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. వ‌ల్ల‌భ‌నేని వంశి ఇదే నిజం అంటూ కామెంట్స్ చేశాడు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago