ANR : స్వయంకృషితో టాలీవుడ్ మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఎందరికో స్పూర్తి. ఇప్పటికీ ఆయన స్పూర్తితో సినిమా పరిశ్రమలోకి చాలా మంది అడుగుపెడుతున్నారు. చిరంజీవి నటన, ఫైట్స్, డ్యాన్స్ చూసి మురిసిపోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే చిరంజీవిపై కోపంతో ఏఎన్ఆర్ తన కుమారుడు నాగార్జునని హీరో చేశాడని అంటారు. చిరంజీవి డేట్స్ దొరకక పోవడం వల్ల విసుగు చెందినటువంటి ఏఎన్ఆర్ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో విక్రమ్ మూవీతో నాగార్జునని హీరోగా పరిచయం చేశారని డైరెక్టర్ గీతాకృష్ణ తెలియజేశారు.
చిరంజీవి కోసం ఎదురు చూసి చివరికి నాగార్జునని తన బ్యానర్ లో హీరోగా పరిచయం చేశారట ఏఎన్ఆర్. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై 23 ఏళ్ల నుంచి చిరంజీవి డేట్స్ కొరకు ఎదురు చూస్తూ వచ్చిన ఆయన చివరికి ఆ నిర్ణయం తీసుకున్నారట. ఫస్ట్ సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న నాగార్జున తర్వాత మజ్ను, సంకీర్తన అనే మూవీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీగా పలు సినిమాలు చేస్తున్నారు నాగార్జున. మరి కొద్ది రోజులలో ది ఘోస్ట్ అనే చిత్రంతో పలకరించబోతున్నాడు.
టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధానపాత్రలో రూపుదిద్దుకున్న హైఓల్టేజ్ యాక్షన్ మూవీ ది ఘోస్ట్ చిత్రం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కగా ఈ మూవీ అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగ్ సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులోని యాక్షన్ దృశ్యాలు హాలీవుడ్ చిత్రాలను తలపించేలా ఉన్నాయన్న టాక్ వినిపించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం కూడా అక్టోబరు 5నే గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…