Mohan Babu : నటరత్న నందమూరి తారకరామారావు సినిమాలపై ప్రేక్షకులలో ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ సోలో హీరోగానే కాకుండా మల్టీ స్టారర్ చిత్రాలు కూడా చేసి అలరించారు. అయితే ఎన్టీఆర్ నటించిన చిత్రాలలో కొండవీటి సింహం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1981 అక్టోబర్ 7న విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్.. ఎస్పీ రంజిత్ కుమార్, రాముగా ద్విపాత్రాభినయం చేశారు. ఎస్పీ రంజిత్ కుమార్ భార్యగా జయంతి, రాముకి జోడీగా శ్రీదేవి నటించారు. రోజా మూవీస్ బ్యానర్ మీద ఎమ్.అర్జున రాజు, కె.శివరామ రాజు నిర్మించారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు మోహన్ బాబు కూడా నటించారు. అయితే అసలు మోహన్ బాబు పాత్రకు ముందుగా చిరంజీవిని అనుకున్నారట. కానీ ఆయన సరిగా చేయలేకపోవడం వల్లన ఆ ఛాన్స్ మోహన్ బాబుకి దక్కింది. అదెలాగా అంటే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం చిరంజీవిని ఎంపిక చేయగా, ఆయనపై ఐదు రోజుల పాటు షూటింగ్ కూడా చేశారట. అయితే ఆయన ఎన్టీఆర్‌కి ఎదురు తిరిగి డైలాగులు చెప్పడంలో కాస్త ఇబ్బంది పడ్డాడట. ఎన్టీఆర్ ఆ సినిమా కోసం నెలరోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారు. ఇక చిరంజీవితో చేస్తే షూటింగ్ ఆలస్యం అవుతుందని మోహన్ బాబుని తీసుకున్నారట. ఆయన సినిమాలో ఎన్టీఆర్‌కి దీటుగా నటించడం విశేషం.
ఇక ఈ సినిమాలో అవినీతిని అంతం చెయ్యడానికి ఎంతటి సాహసానికైనా ఒడిగట్టే పోలీసు పాత్రలో నటరత్న నటన అమోఘం. చక్రవర్తి స్వరపరచిన 7 పాటలు ఎవర్ గ్రీన్. కె.ఎస్. ప్రకాష్ కెమెరా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించిన కొండవీటి సింహం ఎన్టీఆర్, కె.రాఘవేంద్ర రావుల కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను 47 ప్రింట్లతో 43 కేంద్రాల్లో రిలీజ్ చెయ్యగా.. అన్ని కేంద్రాల్లోనూ 70 రోజులు ఆడడం విశేషం. దాదాపు 200 కేంద్రాల్లో అర్థ శతదినోత్సవం, 15 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…