Mahalakshmi : ఈ మధ్య కాలంలో వైరల్ అయిన వార్తల్లో ప్రముఖ నిర్మాత రవీందర్, సీరియల్ నటి మహాలక్ష్మిల వివాహం కూడా ఒకటి. ఇటీవలే వీరు వివాహం చేసుకోగా.. వీరి పెళ్లి ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఆమె అందంగా ఉండడంతో అతన్ని కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని చాలా మంది విమర్శించారు. అలాగే మహాలక్ష్మిని కూడా తీవ్రంగా ట్రోల్ చేశారు. అయినప్పటికీ తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. అని.. అతన్ని తాను డబ్బు కోసం పెళ్లి చేసుకోలేదని.. మహాలక్ష్మి చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు వీరికి చెందిన మరో వార్త వైరల్ అవుతోంది.
రవీందర్ తన భార్య కోసం బంగారం పూత పూసిన ఓ మంచాన్ని తయారు చేయించి గిఫ్ట్‌గా ఇచ్చాడట. అలాగే ఆమెకు సుమారుగా 100 తులాల బంగారం పెట్టాడట. అంత మొత్తం విలువ కలిగిన బంగారు ఆభరణాలను ఆయన స్వయంగా ఆమెకు చేయించి ఇచ్చాడట. దీంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. అయితే దీనిపై నెటిజన్లు మళ్లీ వారిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
డబ్బు కోసం కాదన్నావు. మరి బంగారం ఎందుకు తీసుకున్నావు. అంటే నువ్వు అందుకోసమే ఆయనను పెళ్లి చేసుకున్నావా.. అంటూ మహాలక్ష్మీని మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇటీవలే ఈ జంట హనీమూన్‌కు కూడా వెళ్లి వచ్చింది. అయితే రవీందర్ గురించి డాక్టర్లు మాత్రం పలు సంచలన విషయాలను వెల్లడించారు.
రవీందర్ ఇప్పుడున్న శరీరంతో అలాగే ఉంటే బాగా కష్టమవుతుందని.. కనుక అతను బరువు తగ్గాల్సి ఉంటుందన్నారు. అతనికి బేరియాట్రిక్ సర్జరీ చేయాల్సి ఉంటుందని.. సాధారణ వ్యాయామంతో అతను బరువు తగ్గడం కష్టమని అంటున్నారు. అతను బరువు తగ్గితేనే ఎక్కువ రోజుల పాటు ఆరోగ్యంగా జీవిస్తాడని అంటున్నారు. అయితే ఈ జంట ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందో లేదో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…