Bandla Ganesh : నటుడు, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన బండ్ల గణేష్ ఎప్పటికప్పుడు ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటాడు. తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేధ్య విరామ సమయంలో బండ్ల గణేష్ మిత్రులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం బండ్ల గణేష్‌కు వేద పండితులు ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అయితే లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్‌తో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నట్టు తెలియజేశారు. ఆయనతో కలిసి స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇక కిరణ్ కుమార్ స్వామి వారికి కోటి 50 లక్షలు సమర్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నారని బండ్ల గణేష్ అన్నారు. అయితే బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కిరణ్ కుమార్ వెళుతున్నా కూడా ఆయనని పిలిచి మరి మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక బండ్ల గణేష్ చర్యలు ఓ పట్టాన అర్థం కావు. ఒక సారి సినిమాలే తన జీవితం అంటాడు.. ఇంకోసారి రాజకీయాల్లోకి వస్తాను అని అంటాడు.. ఆల్రెడీ రాజకీయాలతో దెబ్బ తిని ఉన్నాను.. వాటికి జోలికి మళ్లీ వెళ్లను అంటాడు.. కేసీఆర్‌ను పొగుడుతాడు.. కాంగ్రెస్ గురించి గొప్పగా చెబుతాడు.. పవన్ కళ్యాణ్‌ను కీర్తిస్తుంటాడు.. ఇలా పలు రకాలుగా తనలోని కోణాలను చూపిస్తుంటాడు బండ్ల గణేష్.
బండ్ల గణేష్ ప్రస్తుతం ఓ పెద్ద సినిమాను చేయాలని చూస్తున్నాడు. కానీ సరైన కాంబో దొరకడం లేదనిపిస్తుంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలని చూశాడు. కానీ త్రివిక్రమ్ అడ్డు పడ్డట్టుగా ఉంది. అందుకే త్రివిక్రమ్ మీద అగ్గిమీదగుగ్గిలంలా ఫైర్ అవుతుంటాడు బండ్ల గణేష్. గురూజీ అంటూ ఎప్పుడూ ట్రోల్ చేస్తుంటాడు. ఇటు రాజకీయాలకి, అటు సినిమాలకి దూరంగా ఉంటున్నాడు బండ్లగణేష్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…