Chandra Babu : ఏపీలో రాజకీయం రోజురోజుకి రసవత్తరంగా మారుతుంది. చంద్రబాబు.. జగన్‌పై అస్త్రాలు విసురుతుండగా, మరోవైపు జగన్.. చంద్రబాబుని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం రాయదుర్గం లో వివిధ వర్గాల ప్రజలతో నిర్వహించిన ప్రజా వేదిక చర్చా కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పాలనను అంతమెుందించేందుకు ఇంటికొకరు చొప్పున ముందుకు రావాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. తనపై దాడి కూడా జరుగుతుంది అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. ఎలాంటి దాడులకు పాల్పడినా తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ చంద్రబాబు సంచలన కామెంట్స్ చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.
తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తానే ధర్మంగా గెలుస్తానన్నారు. ఈ పాలనపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. ఎన్ని అరాచకాలు చేసినా నిప్పులా బతికాను అన్నారు చంద్రబాబు. గతంలో వైఎస్‌ఆర్ తనపై 26 ఎంక్వేరీలు వేశారని.. ఎన్ని కేసులు వేసినా ఎవరూ ఏమీ చేయలేకపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అరాచకం చేస్తోందన్నారు. ఏదో కంపెనీని తీసుకువచ్చి తన పేరు చెప్పించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్‌మెంట్, రాజధాని, అమరావతి ల్యాండ్స్.. అవుటర్ రింగ్ రోడ్ అవినీతి.. ఇప్పడు ఇప్పుడు ఇన్‌కంట్యాక్స్ అంటున్నారని చంద్రబాబు ఫైరయ్యారు.
నాలుగున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం అరాచకం చేస్తోందంటూ మండిపడ్డారు చంద్రబాబు. ఏదో కంపెనీని తీసుకువచ్చి తన పేరు చెప్పించాలని చూస్తున్నారన్నారు. గతంలో ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్‌మెంట్, రాజధాని, అమరావతి ల్యాండ్స్, అవుటర్ రింగ్ రోడ్ అవినీతి అన్నారని.. ఇప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ అంటున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ విధ్వంస పాలనను ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈ విధ్వంస పాలనను ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు టీడీపీ అధినేత. రైతులకు కూడా చెప్పకుండా భూముల్లో కాల్వలు తవ్వుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఒకవేళ తప్పులను ప్రశ్నిస్తే అడ్డుకునే పరిస్థితి ఉందన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…