Balakrishna : బాలకృష్ణ.. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సీనియర్ హీరోలలో బాలయ్యకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇప్పటికీ కుర్రాళ్లకి పోటీగా సినిమాలు చేస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్.. బ్లాక్ బస్టర్ అన్న పదానికి పర్యాయపదం. సింహాతో సూపర్ హిట్ జర్నీ స్టార్ట్ చేసిన ఈ హీరో, డైరెక్టర్.. తరువాత లెజెండ్, అఖండ సినిమాలతో బాక్సాఫీస్ లెక్కలు మార్చేశారు. అందుకే ఈ మ్యాజికల్ కాంబోను మరోసారి రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రజెంట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. నెక్ట్స్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే బాలకృష్ణకి సంబంధించి తాజాగా ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. ఆయన కెరీర్ ప్రారంభం నుండి డూప్ లేకుండా యాక్షన్ సీన్ లు చేస్తూ దర్శకులను ఆశ్చర్యపరిచేవారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య సీమ సింహం సినిమాలో చేసిన ఓ సీన్ అందరినీ ఆశ్చర్యపరచింది. ఇందులో ట్రాఫిక్ లో బాలయ్య ఓ హాస్పిటల్ కు వెళ్లే సమయంలో ఫ్లై ఓవర్ పై నుండి దూకే సీన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీన్ ను బాలయ్య డూప్ లేకుండా చేయడం విశేషం. హైదరాబాద్ లోని నారాయణగూడ ఫ్లై ఓవర్ పై ఈ సన్నివేశాన్ని చిత్రీకరించగా, 40 అడుగులు ఎత్తు నుండి దూకడం అవసరమా అని దర్శకుడు డూప్ ను పెట్టి మ్యానేజ్ చేస్తామని చెప్పారట.
ప్రేక్షకులకి అంత కిక్ ఉండదని బాలయ్య డూప్ లేకుండా చేశడట. ఈ విషయం గురించి ఫైట్ మాస్టర్ గా చేసిన కనల్ కన్నన్ బాలయ్యపై ప్రశంసలు కురిపించారు. బాలయ్య ఎంతో డెడికేషన్ ఉన్న నటుడని ప్రశంసలు కురిపించారు. బాలయ్య ఇప్పుడేకాదు గతంలో కూడా ఇలాంటి రిస్క్ లు చేశారు. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న 107వ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో మరోసారి నందమూరి హీరో ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు గోపీచంద్ మలినేని కథను రాసుకున్నారు. ఈ చిత్రానికి అన్నగారు అనే టైటిల్ పరిశీలనలో ఉందని కూడా అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…