Hello Brother Movie : సాధారణంగా హీరోలకి డూపులు పెట్టడం కొత్తేమీ కాదు. ఫైటింగ్ సీన్స్ విషయంలోనో లేదంటే డబుల్ క్యారెక్టర్స్ ప్లే చేయాల్సిన సమయంలోనో డూప్‌లని తీసుకుంటారు. అయితే నాగార్జునకు హలో బ్రదర్ సినిమాలో డూప్ గా హీరో శ్రీకాంత్‌ని తీసుకున్నారట. ఈ విషయం చాలా మందికి తెలియదు. కెరీర్ కోసం ట్రై చేస్తున్న సమయంలో శ్రీకాంత్‌కి డూప్‌గా అవకాశం దక్కడం, ఈ సినిమా తర్వాత పాపులారిటీ దక్కించుకోవడం, అనంతరం స్టార్ హీరో స్థాయికి శ్రీకాంత్ ఎదిగారు. ఈ విషయాన్ని శ్రీకాంత్ అప్పుడప్పుడూ ఇంటర్వ్యూలలో కూడా చెబుతు ఉంటారు. ఒకప్పుడు శ్రీకాంత్ ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇటీవలే సెకంగ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన శ్రీకాంత్ అఖండ సినిమాతో విలన్ గా కెరీర్ ను మొదలు పెట్టారు. ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే పాత్రలో నటించి శ్రీకాంత్ ఆకట్టుకున్నారు. నాగార్జున- శ్రీకాంత్ కాంబినేషన్లో 4 సినిమాలు వచ్చాయి. వారసుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, నిన్నే ప్రేమిస్తా, షిరిడి సాయి. అయితే వీరి కాంబినేషన్లో వచ్చిన 5వ చిత్రమే ఈ హలో బ్రదర్ అని నాగార్జున ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇక నిజ జీవితంలో కూడా వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే.
ఇక హలో బ్రదర్ సినిమా విషయానికి వస్తే.. నాగార్జున కెరీర్లో ఆల్ టైం హిట్స్ గా నిలిచిన సినిమాల్లో హలో బ్రదర్ కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇ.వి.వి.సత్య నారాయణ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున.. దేవా మరియు రవి వర్మ పాత్రల్లో డబుల్ రోల్ చేసి అలరించాడు. సుర్రు సుమ్మైపోద్ది అనే మాస్ డైలాగ్ ఇప్పటికీ అందరి నోట్లో నానుతూనే ఉంటుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…