Balakrishna : ఒక‌రికొక‌రు ఎదురుప‌డిన బాల‌కృష్ణ‌, ల‌క్ష్మీపార్వ‌తి.. అప్పుడు ఏం జ‌రిగిందంటే..?

Balakrishna : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నట విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారవు జయంతి సందర్భంగా తెలుగుదేశం నేతలు, సినీ అభిమానులు, నివాళి అర్పించారు. రాష్ట్రానికి, తెలుగు చిత్ర సీమకు ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటున్నారు. సంక్షేమ సారథిగా ప్రజల గండెల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ఆయనతోపాటు సోదరుడు రామకృష్ణ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ…”టీడీపీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు అంటే ఓ వ్యక్తి కాదు శక్తి . సినిమాల్లో రారాజుగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు అని అన్నారు.

అంత క‌న్నా ముందు ఘాట్‌ను జూనియర్ ఎన్టీఆర్‌ సందర్శించి తాతకు నివాళి అర్పించారు. ఆయనతోపాటు కల్యాణ్‌ రామ్‌ కూడా ఉన్నారు. ఆయన రాకను ముందుగానే తెలుసుకున్న అభిమానులు భారీగా ఘాట్‌కు తరలి వచ్చారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అవేమీ పట్టించుకోని ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌ తమ తాత సమాధి వద్ద పుష్పాలు అలంకరించి నివాళి అర్పించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు ఎన్టీఆర్ మరణించినా, ప్రజల్లో ఇంకా బ్రతికే ఉన్నారన్నారు నందమూరి లక్ష్మీపార్వతి. తెలుగు ప్రజల మనసులో స్థిరమైన స్థానం సంపాదించిన వ్యక్తి అని కొనియాడారామె. అంతకుముందు ఘాట్‌కు వచ్చిన ఆమె ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. నటుడు, రాజకీయ నాయకుడిగా ఆయన పోషించిన పాత్ర మరువలేమన్నారు. జూన్ నాలుగు తర్వాత ఏపీలో సుపరిపాలన రాబోతోందని మనసులోని మాట బయటపెట్టారు. తెలంగాణలోనూ మంచి పరిపాలన అందించాలని కోరుకున్నట్లు తెలిపారు లక్ష్మీపార్వతి.

Balakrishna and lakshmi parvati visited sr ntr ghat for praying
Balakrishna

ఆంధ్రప్రదేశ్ లో మరిసోరి మంచి పరిపాలననే నడుస్తుందంటూ పరోక్షంగా ఏపీలో మూడోసారి కూడా వైఎస్సార్ సీపీనే అధికారంలోకి రాబోతుందని ఆమె పేర్కొన్నారు. జూన్ 4 తరువాత జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని.. ఏపీలో మళ్లీ మంచిపాలన వస్తుందని ఆమె అన్నారు. వైఎస్ జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో భారీ చర్చ కొనసాగుతోంది. నిజంగా జగన్ కు మద్దతు ఉందా..? ఒకవేళ ఉంటే.. చంద్రబాబుకు ఇవ్వకుండా జగన్ కు ఎందుకు ఇస్తున్నారు..? ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారా..? ఇలా రకరకాలుగా ఇరు రాష్ట్రాల్లో భారీగా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే నివాళులు అర్పించే స‌మ‌యంలో బాల‌య్య‌, ల‌క్ష్మీ పార్వ‌తి ఎదురెదురు ప‌డ‌గా, ఎవ‌రి దారిలో వారు వెళ్లిన‌ట్టు తెలుస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

13 hours ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

20 hours ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

2 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

2 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

3 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

4 days ago