Janhvi Kapoor : బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సినిమా రంగంలోకి అడుగుపెట్టింది శ్రీదేవి కూతురుగానే అయినా.. తన నటనతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది హీరోయిన్ జాన్వి కపూర్. బాలీవుడ్ లో ఎంతో పేరు తెచ్చుకున్న జాన్వీ కేవలం గ్లామరస్ పాత్రలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా.. తన పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ వస్తుంది. అందుకే అందాల తారగా మిగిలిపోకుండా.. పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ హీరోయిన్ మంచి మార్కులు కొట్టేసింది. ఇక కొద్ది రోజుల్లోనే తెలుగులో కూడా జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరా. సినిమాతో డెబ్యు ఇవ్వనుంది.మొదటి సినిమా విడుదల కాకముందే తన రెండో సినిమా రామ్ చరణ్ తో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాకు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుసాన దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా ప్రస్తుతం జాన్వి కపూర్ హిందీలో మిస్టర్ అండ్ మిసెస్ మహి.. సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. మహేంద్రసింగ్ ధోని బయోపిక్ గా రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా కష్ట పడుతుంది. తాజాగా ఈ మూవీ ప్రీమియర్ షో ఏర్పాటు చేయగా, ఆ షో కోసం జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్‌తో వచ్చి సందడి చేసింది. మహి పేరుతో ఉన్న టైట్ టీ షర్ట్ ధరించి ఈ భామ అందరి దృష్టిని ఆకర్షించింది. జాన్వీ కపూర్ క్యూట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్ ఇంత హాట్ లుక్స్ అందరి మతులు పోగొడుతున్నాయి.
తన తాజా చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహీలో పోషించిన పాత్ర కోసం ఆమె ఎంతగానో క్రికెట్ సాధన చేసింది. గాయాలపాలైనా లెక్కచేయకుండా శిక్షణ తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ‘150కిపైగా రోజుల శిక్షణ, 30 రోజులకుపైగా షూటింగ్, రెండు గాయాలు, ఒక చిత్రం’ అంటూ ఆ వీడియోలో క్యాప్షన్ పెట్టింది. మే 31న థియేటర్లలో మిస్టర్ అండ్ మిసెస్ మహీ విడుదలవుతోందంటూ జాన్వీ తెలిపింది.ఇటీవలే యూట్యూబ్ లో ఓ బీటీఎస్ వీడియోను షేర్ చేసింది. జాన్వీ కపూర్ కు క్రికెట్ శిక్షణ సందర్భంగా ఎదురైన సవాళ్ల గురించి ఈ చిత్ర దర్శకుడు శరణ్ శర్మ వివరించాడు. అలాగే జాన్వీ క్రికెట్ కోచ్ అభిషేక్ నాయర్ కూడా తన అనుభవాలను పంచుకున్నాడు. బరోడా క్యాంప్ లో జాన్వీ శిక్షణ పొందినట్లు వివరించాడు. ఐపీఎల్ కు సిద్ధమయ్యే క్రికెటర్లు ఏ స్థాయిలో శిక్షణ పొందుతారో జాన్వీ కపూర్ సైతం అంతలా కఠోర సాధన చేసిందని ప్రశంసించాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…