Nivetha Pethuraj : ఆకట్టుకునే అందం, మైమరపించే నటనతో చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వారిలో నివేదా పేతురాజ్ ఒకరు. తక్కువ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు దక్షిణాదిలోనూ ఎన్నో చిత్రాల్లో భాగం అవుతోంది. నివేదా పేతురాజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. అయితే నివేదా పేతురాజ్ ఇలా పోలీసులతో వాగ్వాదానికి దిగుతుండటం అనేది కనిపిస్తోంది. అయితే ఈ వాగ్వాదం, ఆమె రియాక్షన్లు, పోలీసుల డ్రెస్సింగ్, ఆ పోలీసులు వేసుకున్న క్రాక్స్ చెప్పులు చూస్తే ఇదంతా స్క్రిప్టెడ్ అని అర్థం అవుతోంది.
దీంతో జనాలు ఈ వీడియోని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి ఐడియాలు ఎప్పుడో పాతపడ్డాయని, కొత్తగా ఆలోచించమని సలహాలు ఇస్తున్నారు. కారులో వెళుతున్న నివేదా పేతురాజ్‌ను పోలీసులు ఆపి మేడం.. ఎలక్షన్ కోడ్ నడుస్తోంది కాబట్టి చెకింగ్‌లో భాగంగా పోలీసులు తనిఖీలు చేశారు. అయితే నివేదా తన కారు డిక్కీ ఓపెన్ చేయడానికి అంగీకరించలేదు.కాసేపు పోలీసులతో వాగ్వాదం చేశారామె. “రోడ్డు వరకు వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్ కూడా ఉన్నాయి. కావాలంటే చూపిస్తాను. చెక్ చేసుకోండి” అని నివేదా పేతురాజ్ బదులిస్తుంది.అయినా పోలీసులు అవేం వద్దు ట్రంక్ (కారు డిక్కీ) ఓపెన్ చేయండి మేడమ్ అని గట్టిగా వారించారు. దానికి “అర్థం చేసుకోండి. ఇది మా కుటుంబ పరువుకు సంబంధించినది.
డిక్కీలో ఏం లేవు. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు” అని నివేదా పేతురాజ్ అసహనం వ్యక్తం చేస్తుంది. ఇంతలో రికార్డ్ అవుతున్న కెమెరావైపు చూస్తూ “ఎందుకు రికార్డ్ చేస్తున్నారు.. ఆపండి” అంటూ కోపంగా కెమెరా తీసేసుకుంది నివేదా పేతురాజ్. అయితే నిజంగానే నివేదా పేతురేజ్ తన డిక్కీలో ఏమైనా తీసుకెళ్తుందా? పోలీసులకు చెకింగ్ కి సహకరించడానికి ఎందుకు భయపడుతుంది అని పలువురు కామెంట్స్ చేస్తుంటే.. ఈ వీడియో చూస్తుంటే ఏదో సినిమా ప్రమోషన్ కోసం చేసినట్లు ఉంది. పోలీస్, నివేదా ఎక్స్‌ప్రెషన్స్ కూడా యాక్టింగ్ చేసినట్టే ఉన్నాయి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…