Balakrishna : నందమూరి బాలకృష్ణ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో మంచి విజయాలని తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం తన 108వ సినిమాని అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఒకవైపు వెండితెరపై సత్తా చాటుతూనే బుల్లితెరపై కూడా సత్తా చాటుతూ అన్‌స్టాపబుల్‌గా బాలయ్య బాబు జర్నీ సాగుతోంది. దీంతో బాలయ్య బాబు రేంజ్ రెట్టింపయింది. ఆయనతో సినిమాలు చేసేందుకు నేటితరం డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాపై బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమాలో టాక్సీవాలా ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్ గా నటించనుంది. పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల ముఖ్య పాత్రలో కనిపించనుంది. బాలయ్య కూతురి పాత్రలో ఆమె నటించనుందని సమాచారం. బాలకృష్ణ కెరీర్ లోనే ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో ఈ సినిమాలో అలరించబోతున్నారట. ఇక ఈ సినిమాకి బాలయ్య భారీ రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం యంగ్ హీరోలు తీసుకుంటోన్న రెమ్యూనరేషన్‌తో పోలిస్తే బాలయ్య పారితోషికం తక్కువే అయినా ఆయన ఎప్పుడూ దీని గురించి ఆలోచించలేదని అంటుంటారు. చాలా కాలంగా బాలయ్య రూ.15 కోట్ల మేర రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని టాక్.
ప్రస్తుతం బాలయ్య సినిమాలు రూ.70 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేస్తుండటం.. అలాగే శాటిలైట్, డిజిటల్ హక్కులకు మంచి డిమాండ్ ఉండటంతో బాలయ్య పారితోషికం పెంచారని టాక్. మొన్నటివరకూ సినిమాకు 15 కోట్లు వరకూ తీసుకున్న బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమా నుంచి 20 కోట్లు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇక అనిల్ రావిపూడి తరువాత ఓ యంగ్ డైరెక్టర్ తో బాలయ్య సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట. పూరీ జగన్నాథ్ , బాలయ్య కాంబో మూవీ ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. కాని దానికి ముహూర్తం కుదరడంలేదు. అది కూడా త్వరలోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…