Prakash Raj : నందమూరి నటసింహం బాలకృష్ణకి అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోగా ఈ మధ్య కాలంలో ఆయన ఏం మాట్లాడినా వివాదం అవుతోంది. కొన్నిరోజుల క్రితం బాలయ్య అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్లు చేయగా అక్కినేని హీరోలు ఒకింత సీరియస్ అయ్యారు. ఆ తర్వాత బాలయ్య అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ఆప్యాయత లేదంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ఎంతో హాట్ టాపిక్ అయ్యాయి. మరోవైపు అన్ స్టాపబుల్ షోలో బాలయ్య నర్సుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొంతమంది కామెంట్లు చేశారు.
బాలయ్య ఏం మాట్లాడిన, ఏం చేసిన ప్రతీది కూడా వివాదం చేస్తున్నారని బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్లపై మండిపడుతున్నారు. ప్రతిదీ వివాదం చేయడం సరికాదని వాళ్లు చెబుతున్నారు. బాలయ్య మంచి వ్యక్తి అని సరదాగా ఉంటారని అంటున్నారు. అయితే బాలయ్య సినిమాలలో కొన్ని ఫన్నీ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. యాభై కేజీల బరువుండే రెండు టన్నుల కార్ ని తన్నగానే ఆమడ దూరం జరగడం. ఒక దెబ్బకు పదిమంది విలన్స్ గాల్లో ఎగరాడం, తొడగొట్టి ట్రైన్ ని వెనక్కి పంపించడం , ట్రైన్ బోగీల మీద బైక్ నడపడం, ట్రైన్ క్రిందపడి కూడా బ్రతకడం ఇలా బాలయ్య ఖాతాలో లాజిక్ లేని మ్యాజికల్ సీన్స్.
కొన్ని సార్లు పాటల్లో కూడా బాలయ్య గ్రాఫిక్స్ వాడి అబాసుపాలయ్యాడు. సాంగ్స్ లో స్టెప్స్ సీజీ చేసి పెట్టేవారు. కాగా బాలయ్య, రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన చివరి చిత్రం పాండురంగడు.ఈ సినిమా ఫలితం ఇవ్వలేదు. పైగా బాలయ్య పరువు తీసింది. ఇందులో బాలయ్య-టబు మీద రాఘవేంద్రరావు తన మార్క్ రొమాంటిక్ సాంగ్ షూట్ చేశాడు. ఈ సాంగ్ ని ట్రోల్ చేస్తూ తమిళ తంబీలు ఎడిట్ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోను ప్రకాష్ రాజ్ లైక్ చేశాడు. బాలయ్యను అవమానిస్తున్నట్లున్న ట్రోల్ వీడియోపై ప్రకాష్ రాజ్ స్పందించడం, లైక్ కొట్టడం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…