Ayyanna Patrudu : ఏపీలో ప్రస్తుతం రాజకీయం చాలా వాడి వేడిగా ఉంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వార్తలలో నిలుస్తున్నారు. వైసీపీ నాయకులపై ఛాన్స్ దొరికినప్పుడల్లా కూడా టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు.తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పలు తీవ్ర విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మంత్రి కొట్టు సత్యనారాయణ నీ సంగతంతా నాకు తెలుసు.. మా ఖర్మ కాలి నువ్వు మంత్రివి అయ్యావు.. మంత్రి ఫోన్ చేస్తేనే పనవుతుందని అందరూ చెబుతున్నారు అని అన్నారు.
ప్రజలతో మద్యం తాగించి, ఆ డబ్బులన్నీ సీఎం జగన్ దోచుకుంటున్నారని, పెన్షన్లను దపదఫాలుగా పెంచుతూ, ప్రజలు ఒక్కొక్కరికి రూ. 26వేల నష్టం చేకూర్చారని అయ్యన్న పాత్రుడు సంచలన ఆరోపించారు. అసమర్ధులందరూ మంత్రులయితే రాష్ట్రం ఎలా బాగు పడుతుందని ఆయన నిలదీశారు. రంగుల రాణి మంత్రి రోజాను ఏదైనా ప్రాజెక్టు అడిగితే.. ‘నా సొగసు చూడు మాయా అంటుంది’ అని అన్నారు. అల్లూరి శత జయంతి ఉత్సవాలు ఈ జిల్లాలో బాగా జరిగితే, విశాఖలో మాత్రం ప్రభుత్వం చేయలేదని విమర్శించారు.
ఈ మంత్రులకు పాలన సాధ్యం కాదని.. కేసులు పెట్టడం మాత్రమే తెలుసంటూ అయ్యన్న పాత్రుడు విమర్శించారు. తనపై లైంగిక దాడి కేసు పెట్టారని, ఈ వయస్సులో తాను లైంగిక దాడి చేయగలనా? అని ఫన్నీగా కామెంట్ చేశారు అయ్యన్న పాత్రుడు. ఇక లైంగికంగా కొందరు వైసీపీ నాయకులు మహిళలని వేధించారని వార్తలు రాగా, వారిపై కూడా పంచ్‌లు వేశారు. ఇక ‘అమ్మా భారతి.. సాక్షి పేపరు ద్వారా బీసీలను విడగొట్టడానికి ప్రయత్నం చేయకు’ అని సూచించారు. బీసీలను టీడీపీకి దూరం చేయడానికి జగన్ పత్రిక ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…