తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. మల్లారెడ్డి ఎంత సరదాగా మాట్లాడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య ఆయన ఎక్కడ ఏది మాట్లాడినా అది వైరల్ అయిపోతోంది. కొద్ది నెలల క్రితం ఆయన మాట్లాడిన ‘కష్టపడ్డా.. పాలమ్మినా.. పూలమ్మినా.. బోర్ వెల్స్ నడిపించినా.. చిట్ ఫండ్స్ వేసినా.. కాలేజీలు పెట్టినా’ అని చేసిన వ్యాఖ్యలు విపరీతంగా జనాల్లోకి వెళ్లింది. కొందరైతే ఈ మాటలని యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ చేశారు. దీంతో ఎక్కడ చూసినా మల్లారెడ్డి మాటలే హల్ చల్ చేశాయి. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలను వివిధ సందర్భాల్లో పదే పదే మల్లారెడ్డి ప్రస్తావిస్తూ వచ్చారు. దాంతో ఆయనకు మరింత పాపులారిటీ పెరిగిపోయింది.
ఇటీవల కేటీఆర్ కూడా తన నోటి నుండి మల్లా రెడ్డి డైలాగులు పేల్చారు. మల్లన్నతో పెట్టుకుంటే గిట్లే ఉంటది. మా మల్లన్న ఏం చెప్పిండు.. పాలు పిండినా అన్నావా లేదా , కూరగాయాలు అమ్మినా.. ఇంకేం అమ్మినవ్.. పూలు కూడా అమ్మినవ్. ఇంకా గమ్మత్తు చెబుతాను ఆగు.. శంకుస్థాపన దగ్గర జనాలంతా మీద పడుతుంటే మల్లన్న అందర్నీ నూకుతున్నారు. అరే ఎందుకే పెద్ద మనిషివి నీకివన్నీ అని అంటే.. చిన్నప్పుడు బర్రెలను కూడా కంట్రోల్ చేశాను సార్.. గిదేంది..!. .. అంటే కష్టపడి జీవితంలో పైకి వచ్చిన మల్లారెడ్డిగారు అన్ని రకాలుగా మీకు అండగా ఉంటున్నారు. అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
అయితే మల్లారెడ్డి మాటలని ఇప్పుడు కొందరు పాటలుగా కూడా మార్చి తెగ డ్యాన్స్‌లు చేస్తున్నారు. తాజాగా ఓ బుడతడు మల్లారెడ్డి ఫేమస్ డైలాగ్స్ చెప్పి ఆ తర్వాత తీన్మార్ డ్యాన్స్ చేశాడు. మల్లారెడ్డి డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. చూస్తుంటే రానున్న రోజులలో సినిమాలలో కూడా మల్లారెడ్డి డైలాగ్స్ పెడతారా ఏంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…